అన్వేషించండి

Telangana News: 'మహిళా ఉపాధ్యాయ దినోత్సవం'గా సావిత్రి బాయి ఫూలే జయంతి - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

CM Revanth Reddy: సావిత్రిబాయి ఫూలే జయంతిని ప్రతి ఏటా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫూలే ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Savitri Bhai Phule Jayanti As Women Teachers Day In Telangana: బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే (Savitribai Phule) జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచి, సమానత్వానికి పోరాడిన సావిత్రిబాయి ఫూలే జయంతి (జనవరి 3)ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సావిత్రి బాయి పూలే ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ఈ సందర్భంగా ఫూలే దంపతుల సేవలు, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పుకు సావిత్రీబాయి ఫూలే పునాది వేశారని కొనియాడారు.

మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించి, అణచివేయబడిన వర్గాలకు న్యాయం అందించేందుకు తమ జీవితాన్ని ఆర్పించారని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. సావిత్రీబాయి ఆశయాలను సాధించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మహిళల సాధికారతకు పెద్దపీట వేయటంతో పాటు, ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించే నైపుణ్యాల వృద్దికి వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. బీసీలు, బడుగు, బలహీన వర్గాల సామాజిక, రాజకీయ అభ్యున్నతికి పాటుపడే భవిష్యత్తు ఆలోచనలతో రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి సర్వేను తమ ప్రభుత్వం ఇటీవలే పూర్తి చేసిందని అన్నారు. 

సీఎంకు మంత్రి పొన్నం ధన్యవాదాలు

సావిత్రిబాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హర్షం వ్యక్తం చేశారు. దేశ తొలి ఉపాధ్యాయురాలిగా మహిళలు చదువుకుంటేనే ఆ ఇంటికి వెలుగని చాటిన ధీశాలి సావిత్రిభాయి ఫూలే అని కొనియాడారు. ఫూలే సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా నిలబడి దేశంలో మొదటి మహిళా పాఠాలకు పునాదులు వేశారన్నారు. అత్యంత గౌరవనీయమైన మహిళా ఉపాధ్యాయుల్లో ఒకరైన సావిత్రీబాయి విద్య ద్వారా స్త్రీలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారన్నారు. ఆ మహనీయురాలి జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: 'మహిళా ఉపాధ్యాయ దినోత్సవం'గా సావిత్రి బాయి ఫూలే జయంతి - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
'మహిళా ఉపాధ్యాయ దినోత్సవం'గా సావిత్రి బాయి ఫూలే జయంతి - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Pawan Kalyan: రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: 'మహిళా ఉపాధ్యాయ దినోత్సవం'గా సావిత్రి బాయి ఫూలే జయంతి - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
'మహిళా ఉపాధ్యాయ దినోత్సవం'గా సావిత్రి బాయి ఫూలే జయంతి - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Pawan Kalyan: రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
Game Changer Trailer Launch Highlights: రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
AI Tools: ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Badal Babu Love: ఫేస్ బుక్ లవ్‌తో బాదల్ బాబుకు ప్రేమ 'బాధలు' - లవర్ కోసం పాక్‌కు వెళ్తే ఊహించని ట్విస్ట్
ఫేస్ బుక్ లవ్‌తో బాదల్ బాబుకు ప్రేమ 'బాధలు' - లవర్ కోసం పాక్‌కు వెళ్తే ఊహించని ట్విస్ట్
Embed widget