Ganja Smugglers drive over Police at Kakinada Toll Plaza | పోలీసులను కారుతో గుద్దుకుంటూ వెళ్లిన స్మగ్లర్లు
కాకినాడలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. క్రిష్ణవరం టోల్ ప్లాజా దగ్గర పోలీసులు సాధారణ వాహన తనిఖీలు చేస్తుండగా.. గంజాయి తరలిస్తున్న స్మగ్లర్ల కారును కూడా ఆపారు. చెకింగ్ చేయాలని పోలీసులు చెప్పడంతో.. స్మగ్లర్లు నిర్దాక్షిణ్యంగా కారును ముందుకు పోనిచ్చారు. కారును ఆపే ప్రయత్నం చేసిన కానిస్టేబుళ్లను గుద్దేస్తూ స్మగ్లర్లు ముందుకు పోయారు. దీనికి సంబంధించి సీసీటీవీ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటనతో స్మగ్లర్లు ఎంతకు తెగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.కాకినాడలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. క్రిష్ణవరం టోల్ ప్లాజా దగ్గర పోలీసులు సాధారణ వాహన తనిఖీలు చేస్తుండగా.. గంజాయి తరలిస్తున్న స్మగ్లర్ల కారును కూడా ఆపారు. చెకింగ్ చేయాలని పోలీసులు చెప్పడంతో.. స్మగ్లర్లు నిర్దాక్షిణ్యంగా కారును ముందుకు పోనిచ్చారు. కారును ఆపే ప్రయత్నం చేసిన కానిస్టేబుళ్లను గుద్దేస్తూ స్మగ్లర్లు ముందుకు పోయారు. దీనికి సంబంధించి సీసీటీవీ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటనతో స్మగ్లర్లు ఎంతకు తెగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.