అన్వేషించండి

Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్

Andhra News: న్యూ ఇయర్ వేళ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. తనకు స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

Student Commits Suicide After Wishing Her Friend Happy New Year In Anantapuram: న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ఏపీలోని అనంతపురానికి (Anantapuram) చెందిన విద్యార్థిని తనకు స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని బలవన్మరణానికి పాల్పడింది. ఇక తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాకు (Siricilla District) చెందిన విద్యార్థి తన స్నేహితురాలికి విషెష్ చెప్పగా అమ్మాయి తల్లిదండ్రులు అతనిపై దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన.. చిన్నతిప్పమ్మ (17) బళ్లా రోడ్డులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఈమెకు అదే కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోన్న విద్యార్థిని బెస్ట్ ఫ్రెండ్. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు.

న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని..

అయితే, మంగళవారం రాత్రి హాస్టల్‌లోని విద్యార్థినులంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో చిన్నతిప్పమ్మకు తన బెస్ట్ ఫ్రెండ్ విషెష్ చెప్పలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె బుధవారం హాస్టల్‌లోని మెస్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీన్ని గుర్తించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించగా.. వారు పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హాస్టల్ వద్ద తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. 

విద్యార్థిని మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వాస్పత్రి వద్ద విద్యార్థి సంఘాల నేతలతో కలిసి ఆందోళనకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిందని.. కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూ ఇయర్ విషెష్ చెప్పాడని..

అటు, తెలంగాణలోనూ న్యూ ఇయర్ వేళ తీవ్ర విషాదం జరిగింది. తన క్లాస్‌మేట్‌కు న్యూ ఇయర్ విషెష్ చెప్పిన బాలుడు.. సాయంత్రం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గంబీరావుపేట మండలం భీమునిమల్లారెడ్డి గ్రామానికి చెందిన శివకిషోర్ (17) అనే పదో తరగతి విద్యార్థి.. అదే గ్రామానికి చెందిన అమ్మాయికి న్యూ ఇయర్ విషెష్ చెప్పాడు. ఈ క్రమంలో అతనిపై.. అమ్మాయి కుటుంబసభ్యులు, బంధువులు దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శివకిషోర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబసభ్యులు పరారయ్యారు. అంతకు ముందు మృతుని తల్లికి కూడా వీరు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

శివకిషోర్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

తలలోకి క్రాకర్స్ దూసుకెళ్లి..

మరోవైపు, న్యూ ఇయర్ వేళ విశాఖలో తీవ్ర విషాదం జరిగింది. విశాఖలో శివ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఇంటి మేడపై క్రాకర్స్ కాలుస్తుండగా ప్రమాదవశాత్తు అతని తలలోకి దూసుకెళ్లింది. దీంతో సంఘటన స్థలంలోనే కుప్పకూలగా.. వెంటనే అతన్ని కుటుంబసభ్యులు, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.

Also Read: Crime News: రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ - తనిఖీ చేస్తుండగా కానిస్టేబుళ్లపై కారు ఎక్కించేశాడు, షాకింగ్ వీడియో

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget