(Source: ECI/ABP News/ABP Majha)
Farm Milk Vs Packet Milk: తాజా పాలు Vs ప్యాకెట్ పాలు: ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?
ఏ ఇంట్లో చూసినా వాడేది ప్యాకెట్ పాలు. 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఎక్కువ వినియోగిస్తారు కానీ ఇవి నిజంగానే ఆరోగ్యానికి మంచి చేస్తాయా?
ఒకప్పుడు సైకిల్ వేసుకుని పాల వాడు వచ్చి ఇంటింటికీ తిరిగి పాలు పోసి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు మనం నిద్రలేచేసరికి ఇంటి ముందు పాల ప్యాకెట్ దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పాల ప్యాకెట్లు లభిస్తున్నాయి. వీధికి కనీసం రెండు మూడు డెయిరీలు వెలుస్తున్నాయి. తాజా పాలు దొరకడం అంటే ఈ రోజుల్లో కష్టమే. కానీ కొన్నేళ్ళ క్రితం తాజా పాలు మాత్రమే దొరికేవి. ప్యాకెట్ పాలు, తాజా పాలు ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరం అనే దాని గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. వీటిలో ఏది ఆరోగ్యకరమైన ఎంపిక అనే విషయం తప్పకుండా తెలుసుకోవాలి.
తాజా పాలు
బర్రెలు, ఆవుల నుంచి నేరుగా ఇంటి దగ్గరకే వచ్చే పచ్చి, సేంద్రీయ పాలు తాజావి. ఏ విధంగానూ ప్రాసెస్ చేయబడవు. పాశ్చరైజేషన్ ఉండదు. వీటిని ఫ్రీజ్ చేస్తే కొన్ని గంతలు లేదా రోజుల షెల్ఫ్ జీవితాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఆ పాలు కాచి పెట్టుకుంటే రెండు రోజుల వరకు బాగుంటాయి. ఇవి అత్యంత ఆరోగ్యకరమైనవి.
ప్యాకెట్ పాలు
ప్రాసెస్ చేసిన పాలు సాధారంగా ప్యాకెట్లు లేదా కంటైనర్ల రూపంలో అందుబాటులో ఉంటాయి. ప్యాక్ చేసిన టెట్రా ప్యాక్, మిల్క్ పౌచ్ మొదలైన వాటిలో లభిస్తుంది. అన్ని దుకాణాలు, మార్ట్, కిరాణా షాపుల్లో సులభంగా అందుబాటులో ఉంటాయి. స్థానిక డెయిరీ సరఫరాదారులు కూడా ప్రాసెస్ చేసిన పాలను కంటైనర్లలో పంపిణీ చేస్తున్నారు. ఇవి తాజా పాల కంటే ఎక్కువ జీవితకాలం కలిగి ఉంటాయి. అంటే సుమారుగా ప్రాసెస్ చేయబడిన పాలు రెండు వారాల వరకు ఉపయోగపడతాయి. ఫ్రిజ్ లో పెట్టకుండా స్టోర్ అల్మారాలో ఉండే ప్యాకెట్లు కూడా కనిపిస్తాయి. అటువంటివి అంగన్వాడీ కేంద్రాల్లో కనిపిస్తాయి. మూడు నెలల వరకు ఆ పాల ప్యాకెట్ ఫ్రిజ్ లో పెట్టకపోయినా చెడిపోకుండా ఉంటాయి.
ప్రాసెస్ చేసిన పాల ప్రాసెసింగ్ పద్ధతి, ప్యాకేజింగ్ రకం విభిన్నంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ పాలు తాగిన తర్వాత అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడొచ్చు. ప్యాకెట్ మిల్క్ ఎక్కువగా ప్రాసెస్ చేయబడతాయి. పాశ్చరైజేషన్, UHT, హోమోజనైజేషన్, ఫోర్టిఫికేషన్ అనేది ప్యాకెట్ పాలను తయారు చేయడానికి ఉపయోగించే అన్ని పద్ధతులు. ఈ విధానాలు పాల షెల్ఫ్ జీవితాన్ని, పోషక పదార్థాలని విస్తరించడానికి ఉపయోగపడతాయి. ఇలా చేయడం అంటే పాల కల్తీ అని అంటారు. ఈ కల్తీ పాలు హానికరం.
తాజా పాలు ఫామ్స్ నుంచి నేరుగా ఇంటికి వస్తుంది. అందులోని పోషకాలు చెక్కు చెదరవు. కానీ ప్యాకెట్ పాలు పోషక విలువలు కోల్పోయి జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది. సేంద్రీయ పాలలో సహజంగా 17 కంటే ఎక్కువ సూక్ష్మపోషకాలు ఉంటాయి. పాశ్చరైజేషన్ ఉండదు. వీటిలో విటమిన్ ఏ, బి 12, ఒమేగా 3 గీయతీ యాసిడ్స్ వంటి సహజ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఫామ్ పాలలో సహజమైన చక్కెరలు ఉంటాయి. శరీరానికి శక్తిని అందించే లాక్టోజ్ ఇందులో పుష్కలంగా లభిస్తుంది. అందుకే ఇవి ఆరోగ్యకరమైనవని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మధుమేహులకు గుడ్ న్యూస్, మీ డైట్ ఇలా ప్లాన్ చేశారంటే షుగర్ లెవల్స్ అసలు పెరగవు