అన్వేషించండి

Coromandel Train Accident: ఒడిశా ప్రమాదం తర్వాత చాలా రైళ్ల రూట్ల మార్పు, కొన్ని ట్రైన్స్‌ రద్దు

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం తర్వాత పలు రైళ్ల రూట్లు మారాయి. అదే సమయంలో పలు రైళ్లను కూడా రద్దు చేస్తూ రైల్వే శాఖ ప్రకటన ఇచ్చింది.

Odisha Train Accident: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మరణించగా, 900 మందికి పైగా గాయపడ్డారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ప్రధాని మోదీ మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

ప్రమాదం తర్వాత రైల్వే శాఖ చాలా రైళ్లను దారి మళ్లించింది. ఆ పరిస్థితి లేని ట్రైన్స్‌ రద్దు చేసింది. అలాంటి రైళ్లా జాబితాను విడుదల చేసింది.

దారి మళ్లించిన రైళ్ల జాబితా ఇలా ఉంది.

రైలు నెంబర్ 22807 టాటా జంషెడ్ పూర్ మీదుగా వెళ్తుంది.

రైలు నెంబర్ 22873 కూడా టాటా జంషెడ్ పూర్ మీదుగా వెళ్తుంది.

రైలు నెంబర్ 18409ను టాటా జంషెడ్ పూర్ వైపు మళ్లించారు.

రైలు నెంబర్ 22817ను కూడా టాటా వైపు మళ్లించారు.

రైలు నెంబర్ 15929ను తిరిగి భద్రక్ కు పిలిపించారు.

12840 చెన్నై సెంట్రల్-హౌరా ప్రస్తుతం ఖరగ్ పూర్ డివిజన్ లోని జరోలి గుండా నడుస్తుంది.

18048 వాస్కోడిగామా - షాలిమార్ కటక్, సల్గావ్, అంగుల్ మీదుగా దారి మళ్లించబడింది.

సికింద్రాబాద్-షాలిమార్ (22850) వీక్లీ రైళ్లను కటక్, సల్గావ్, అంగుల్ మీదుగా మళ్లిస్తారు.

రద్దయిన రైళ్ల జాబితా ఇలా ఉంది.

రైలు నెంబర్ 12837 హౌరాపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేశారు. అలాగే రైలు నెంబర్ 12863 హౌరా-ఎస్ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేశారు. రైలు నెంబర్ 12839 హౌరా-చెన్నై సెంట్రల్ మెయిల్, 12895, 20831, 02837 రైళ్లను కూడా రద్దు చేశారు.

ఎవరు ఏం చెప్పారు?

రైలు నెంబర్ 12841 చెన్నై సెంట్రల్ నుంచి షాలిమార్ వెళ్తోంది. ఈ రైలు జూన్ 2న మధ్యాహ్నం 3.30 గంటలకు షాలిమార్ కు బయలుదేరింది. రాత్రి 8.30 గంటలకు ఖరగ్ పూర్ డివిజన్ పరిధిలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేసి హెల్ప్‌లైన్‌ నంబర్, సహాయక చర్యల గురించి తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న షాలిమార్-కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఈ సాయంత్రం బాలాసోర్ సమీపంలో ప్రమాదానికి గురికావడం దిగ్భ్రాంతికి గురిచేసిందని, కొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని అన్నారు.

సంతాప దినాలు

ఒడిశాలోని బాలాసోర్ లో శుక్రవారం (జూన్ 2) సాయంత్రం జరిగిన భారీ రైలు ప్రమాదంలో 233 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం (జూన్ 3) ఉదయం వరకు సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, రైలు బోగీల నుండి మృతదేహాన్ని తొలగించడానికి వారు నిరంతరం కృషి చేస్తున్నారు. కాగా, ఈ ఘటనతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో ఒక రోజు సంతాప దినాలు ప్రకటించారు.

బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒక రోజు సంతాప దినాలు పాటించాలని ఆదేశించారని, అందువల్ల జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

మోదీ కార్యక్రమాలు రద్దు

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా ప్రధాని కార్యక్రమాలను కూడా మార్చేశారు. ముంబై-గోవాకు తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది. అది వాయిదా పడింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో మాట్లాడారు.

టాప్ హెడ్ లైన్స్

Indian Railways Transformation: బడ్జెట్ కేటాయింపుల నుండి బుల్లెట్ వేగం వరకు - మోదీ హయాంలో ఇండియన్ రైల్వేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విప్లవం!
బడ్జెట్ కేటాయింపుల నుండి బుల్లెట్ వేగం వరకు - మోదీ హయాంలో ఇండియన్ రైల్వేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విప్లవం!
Parliament Monsoon Session 2026 Big Bills: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు - తెరవెనుక బిగ్ బిల్స్ వ్యూహం - దేశ రాజకీయాన్ని మార్చబోతున్న కీలక బిల్లులు!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు - తెరవెనుక బిగ్ బిల్స్ వ్యూహం - దేశ రాజకీయాన్ని మార్చబోతున్న కీలక బిల్లులు!
Parliament Seat Redistribution: డీలిమిటేషన్ పజిల్ - యూనిఫాం 50% ఫార్ములా కు దక్షిణాది సై.. నియోజకవర్గాల పునర్విభజనపై మారిన పొలిటికల్ మైండ్‌సెట్!
డీలిమిటేషన్ పజిల్ - యూనిఫాం 50% ఫార్ములా కు దక్షిణాది సై.. నియోజకవర్గాల పునర్విభజనపై మారిన పొలిటికల్ మైండ్‌సెట్!
Breaking News: లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్
లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget