IND vs AUS 5th Test: కీలకమైన 5వ టెస్టులో అదే సీన్ - లంచ్ సమయానికే టాపార్డర్ ఔట్, కోహ్లీపైనే భారం
India vs Australia 5th Test Updates | బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న 5వ టెస్టులో భారత్ 57 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. దాంతో విరాట్ కోహ్లీపైనే భారం పడింది.
Border–Gavaskar Trophy | సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన 5వ టెస్టులోనూ భారత్ ఆటతీరు ఏమాత్రం మారలేదు. లంచ్ సమయానికి టపార్డర్ ఔటైంది. 11 పరుగులకు కేల్ రాహుల్ (KL Rahul) వికెట్ కోల్పోయిన టీమిండియా 17 పరుగుల వద్ద మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ వికెట్ చేజార్చుకుంది. లంచ్ కు ముందు శుబ్ మాన్ గిల్ (20) ఔట్ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. లంచ్ సమయానికి భారత్ 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన చివరి టెస్టులో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. ముగ్గురు టాపార్డర్ బ్యాటర్లు ఔట్ కావడంతో, విరాట్ కోహ్లీ (12 నాటౌట్), రిషభ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డిలపై భారం పడింది. కోహ్లీ (Virat Kohli) బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తేనే జట్టు కొంచెం రిలాక్స్ అవుతుంది.
త్వరగా ఓటైన ఓపెనర్లు, గిల్
క్రీజులో కుదురుకోవడానికి రాహుల్, జైస్వాల్ ప్రయత్నించారు. ఆచితూచి ఆడుతూ బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేసినా ఆసీస్ పేపర్లు వారికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మొదట స్టార్క్ బౌలింగ్ లో రాహల్ ఆడిన బంతిని యువ ఆటగాడు కోన్‌స్టాస్ క్యాచ్ పట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. ఆపై గిల్ క్రీజులోకి వచ్చాడు. కీలక ఇన్నింగ్స్ ఆడతాడని భావించిన జైస్వాల్ ను బోలాండ్ బోల్తా కొట్టించాడు. నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ అద్భుత ప్రదర్శన చేసిన జైస్వాల్ సిడ్నీ టెస్టులో త్వరగా పెవిలియన్ చేరాడు. రోహిత్ స్థానంలో జట్టులోకి వచ్చిన గిల్ లంచ్ కు ముందు ఔటయ్యాడు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన గిల్ స్పిన్నర్ లయన్ చేతికి చిక్కాడు. స్టీవ్ స్మిత్ క్యాచ్ పట్టడంతో భారత్ 3వ వికెట్ కోల్పోయింది. లంచ్ తరువాత రిషబ్ పంత్ బ్యాటింగ్ కువచ్చాడు. ప్రస్తుతం 30 ఓవర్లలో భారత్ 3 వికెట్ల నష్టానికి 67 పరుగుల చేసింది. కోహ్లీ 14, పంత్ 7 పరుగులతో నౌటౌట్‌గా ఉన్నారు. వీరిద్దరి మధ్య భారీ భాగస్వాయ్యం వస్తే జట్టుకు కొంత ఊరట కలుగుతుంది.
That's Lunch on Day 1 of the 5th Test.
— BCCI (@BCCI) January 3, 2025
India 57/3
Scorecard - https://t.co/NFmndHLfxu… #AUSvIND pic.twitter.com/c3V8T8T8rc
కీలక టెస్టు నుంచి రోహిత్ శర్మ ఔట్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే తప్పక నెగ్గి ఆశలు సజీవంగా నిలుపుకోవాల్సిన సిడ్నీ టెస్టు నుంచి భారత కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించారు. ఈ ఒక్క టెస్ట్ ఆడిద్దామని బీసీసీఐ సూచించినా, కోచ్ గౌతం గంభీర్ వద్దని వారించినట్లు తెలుస్తోంది. మరోవైపు కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ సైతం చివరి టెస్టుకు ముందు పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో చివరి టెస్టులో టాస్ సమయంలో జస్ప్రిమ్ బుమ్రా స్టేడియంలోకి రావడంతో రోహిత్ పై వేటు కన్ఫామ్ అయింది.
కెప్టెన్ రోహిత్‌ను వెనకేసుకొచ్చిన బుమ్రా
చివరి టెస్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్, గాయపడిన బౌలర్ ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ కృష్ణ తుది జట్టులోకి వచ్చారు. రోహిత్ శర్మ రెస్ట్ తీసుకుంటానని కోచ్ గంభీర్‌కు చెప్పాడని.. జట్టు ప్రయోజనాలే ముఖ్యమని డిస్కస్ చేసినట్లు బుమ్రా తెలిపాడు. సిరీస్ మధ్యలో అది కూడా ఫాంలో లేడని, జట్టును సైతం నడిపించలేకపోతున్నాడని భారత కెప్టెన్‌ను మధ్యలోనే జట్టు నుంచి తప్పించడం ఇదే తొలిసారి. గతంలో కొందరు ఆటగాళ్లు తప్పుకున్నా, అది వారి సొంత నిర్ణయం.