Rohit Sharma: ఐదో టెస్ట్ నుంచి రోహిత్ శర్మ ఔట్, టీమిండియా కెప్టెన్ పేరిట చెత్త రికార్డు! - క్లారిటీ ఇచ్చిన బుమ్రా
Team India | బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా సిడ్నీలోని 5వ టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించారు. అతడి స్థానంలో శుభ్‌మన్ గిల్, ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ కృష్ణ టీంలోకి వచ్చారు.
అప్రతిష్ట మూటకట్టుకున్న రోహిత్ శర్మ
సిడ్నీ: అంతా ఊహించిందే జరిగింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో రోహిత్ శర్మను జట్టు నుంచి తొలగించారు. ఈ ఒక్క టెస్టు ఆడించాక రోహిత్ పై వేటు వేయాలని బీసీసీఐ ఇచ్చిన సలహాను కెప్టెన్ గౌతం గంభీర్ పట్టించుకోలేదు. ఇదివరకే 1-0తో ఆధిక్యంలో ఉన్న సిరీస్‌లో భారత్ 1-2కి పరిమితమైంది. ఓ వైపు కెప్టెన్‌గా, మరోవైపు బ్యాటర్‌గా పూర్తిస్థాయిలో విఫలమైన రోహిత్ శర్మను బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో కీలకమైన 5వ టెస్టు జట్టు నుంచి తప్పించారు. తొలి టెస్టులో కెప్టెన్సీ చేసిన పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పగించారు.
రోహిత్ శర్మ చెత్త రికార్డ్..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌నకు కీలకంగా మారిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ కావడంతో రోహిత్ శర్మను కోచ్ గౌతం గంభీర్ తప్పించాడు. రోహిత్ తనంతట మ్యాచ్ ఆడటం లేదని చెప్పాడని ప్రచారం జరిగింది. కానీ రోహిత్ శర్మకు అలాంటి అవకాశం లేదు. అతడి ప్రదర్శన చూస్తే ఐదు ఇన్నింగ్స్ లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 31 రన్స్ మాత్రమే చేశాడు. దాంతో అటు కెప్టెన్‌గా ఇటు బ్యాటర్‌గా విఫలమైన రోహిత్ శర్మపై వేటు పడింది. ఈ క్రమంలో రెగ్యూలర్ కెప్టెన్ అయి ఉండి సిరీస్ మధ్యలోనే జట్టు నుంచి ఉద్వాసనకు గురైన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ధోనీ, అనిల్ కుంబ్లే లాంటి ఆటగాళ్లు కెప్టెన్లుగా సిరీస్ మధ్యలోనే తప్పుకున్నా.. ఆ నిర్ణయం ఆటగాళ్లు తీసుకున్నాడు. రోహిత్ విషయంలో అలా జరగలేదు. కోచ్ గంభీర్, బీసీసీఐ మేనేజ్ మెంట్ రోహిత్ ను కీలకమైన సిడ్నీ టెస్ట్ నుంచి తప్పించింది.
🚨 Here's #TeamIndia's Playing XI 🔽
— BCCI (@BCCI) January 2, 2025
UPDATES ▶️ https://t.co/cDVkwfEkKm#AUSvIND pic.twitter.com/BO2pofWZzx
రోహిత్ ఆడకపోవడంపై స్పందించిన జస్ప్రిత్ బుమ్రా
టాస్ కోసం వచ్చిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా ఐదో టెస్టులో మార్పులపై స్పందించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ చివరి టెస్టు నుంచి రెస్ట్ తీసుకుంటానని చెప్పాడు. జట్టు ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుని లీడర్ షిప్ క్వాలిటీ చూపించాడు. ఇందులో ఎవరి స్వార్థం లేదు. జట్టు విజయాలు ముఖ్యం. గాయపడిన బౌలర్ ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ కృష్ణ జట్టులోకి వచ్చాడని బుమ్రా తెలిపాడు.
ఆస్ట్రేలియా జట్టులో ఓ మార్పు చోటుచేసుకుంది. మిచెల్ మార్ష్ స్థానంలో కొత్త ఆల్ రౌండర్ వచ్చాడు. బ్యూ వెబ్‌స్టర్ టెస్టు అరంగేట్రం చేశాడు. వెటరన్ బ్యాటర్ మార్క్ వా నుంచి బ్యాగీ గ్రీన్ క్యాప్ అందుకున్నాడు వెబ్‌స్టర్.
బుమ్రా కెప్టెన్సీలో భారత్ తొలి టెస్టులో భారీ విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ భారత్ నుంచి వచ్చి జట్టుతో చేరాక రెండో టెస్టులో ఓటమి, మూడో టెస్ట్ అతికష్టం మీద డ్రా చేసుకోగా, నాలుగో టెస్టులోనూ ఓటమి వెక్కిరించింది. చివరి టెస్టులో నెగ్గితేనే టెస్ట్ చాంపియన్ షిప్ ఆశలు సజీవంగా ఉంటాయి.