అన్వేషించండి

Mukkoti Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్లలేనివారు.. హైదరాబాద్​ ఈ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి!

Vaikunta Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి అనగానే భక్తులంతా తిరుమల వెళ్లాలని భక్తులు భావిస్తారు. అయితే తిరుమల వెళ్లలేని భాగ్యనగర వాసులు ఈ ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనం చేసుకోవచ్చు. 

Vaikunta Ekadasi Celebrations2025:  జనవరి 10 ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఆలయాలు భక్తులతో కళకళలాడిపోతాయ్..

జియాగూడ రంగనాథ స్వామి ఆలయం  

తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఎలా నిర్వహిస్తారో..హైదారాబాద్ జియాగూడలో ఉన్న రంగనాథ స్వామి ఆలయంలోనూ అంతే వైభవంగా వేడుకలు సాగుతాయి. 400 సంవత్సరాల నాటి ఈ ఆలయాన్ని మూసీ నది ఒడ్డున రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ద్రవిడ శైలిలో నిర్మించారు. మూడు అంచెల రాజగోపురం కలిగి ఉండే ఈ ఆలయ గర్భగుడిలో రాతితో చెక్కిన శేషతల్పంపై సేదతీరుతున్న శ్రీ రంగనాథుడు దర్శనమిస్తాడు. ఇక్కడ రంగనాయకిగా కొలువైన శ్రీ మహాలక్ష్మి సహా ఇక్కడ ఆంజనేయస్వామి, గరుత్మంతుడి ఆలయాలను దర్శించుకోవచ్చు. గరుడ మందిరం వెనుక పంచలోహాలతో తయారుచేసిన ధ్వజస్తంభంపై శ్రీ మహావిష్ణువు దశావతారాలు చెక్కి ఉంటాయి. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. ఏటా బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి వేడుకలు కూడా కన్నుల పండువగా జరుగుతాయి. ఇక్కడ రంగనాథుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం కోసం భారీగా భక్తులు పోటెత్తుతారు.   

Also Read: కరవు, యుద్ధం, పకృతి వైపరీత్యాలు, అంటు వ్యాధులు..2025లో జరగబోయే ఈ సంఘటనలు ప్రపంచాన్ని వణికిస్తాయ్!

హిమాయత్ నగర్  వేంకటేశ్వర స్వామి ఆలయం

హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఉన్న టీటీడీ ఆలయంలో నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. ముక్కోటి ఏకాదశి లాంటి పర్వదినాల్లో స్వామివారి ఉత్తర ద్వార దర్శనంకోసం భక్తులు పోటెత్తుతారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. తెల్లవారుజామునుంచి భక్తులు ఉత్తరద్వార దర్శనంకోసం బారులు తీరుతారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

జూబ్లీ హిల్స్ వేంకటేశ్వర స్వామి ఆలయం

హైదరాబాద్ లో ఉన్న మరో టీటీడీ ఆలయం జూబ్లీహిల్స్ లో ఉంది. తిరుమల శ్రీవారినే దర్శించుకుంటున్న అనుభూతిని ఇచ్చే ఈ ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భారీగా వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే క్యూ లైన్లకోసం ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్వామివారికి నివేదించే ప్రసాదంతో పాటూ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇక్కడ కూడా అందుబాటులో ఉంటుంది.

Also Read: ఉత్తరాయణం ఎప్పటి నుంచి ప్రారంభం.. మకర సంక్రాంతి ఎందుకు పెద్ద పండుగ!

చిలుకూరు బాలాజీ

చిలుకూరు బాలాజీ..లక్షల మంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా వీకెండ్స్ లో భక్తులు పోటెత్తుతారు. ప్రత్యేక పండుగలు, పర్వదినాల్లో ఈ రద్దీ మరింత ఉంటుంది. హైదారాబాద్ వాసులు అయినా, హైదరాబాద్ వచ్చేవారు అయినా తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. ఇక్కడ స్వామివారిని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు.

రత్నాలయం దేవాలయం  

ప్రముఖ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో మరొకటి రంగారెడ్డి జిల్లా అలియాబాద్ లో ఉన్న రత్నాలయం. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరుడు   ఆండాళ్ దేవితో పూజలందుకుంటాడు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడిపై కొలువై ఉంటాడు.  

హైదరాబాద్‌ లో శ్రీ వేంకటేశ్వరుడి భక్తులు ముక్కోటి ఏకాదశి రోజు బిర్లామందిర్, జూబ్లిహిల్స్ లో ఉన్న జగన్నాథ స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇంకా నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న వైష్ణవ ఆలయాల్లోనూ స్వామివారి ఉత్తర ద్వార దర్శనంకోసం ఏర్పాట్లు చేస్తారు.  

Also Read:  ఈ నియమాలు పాటించకపోతే వీఐపీలకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కష్టమే!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
India Post Rakhi Offer 2026: రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget