By: ABP Desam | Updated at : 02 Jun 2023 04:41 PM (IST)
మే నెలలో యూపీఐ లావాదేవీల రికార్డ్
UPI Payments in May 2023: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా జరుగుతున్న లావాదేవీలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో, UPI ట్రాన్జాక్షన్లు 9 బిలియన్లకు చేరుకున్నాయని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. దేశంలో రిటైల్ పేమెంట్లు & సెటిల్‌మెంట్ సిస్టమ్‌ను నిర్వహించే ఈ అంబ్రెల్లా బాడీ, తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ సమాచారాన్ని షేర్ చేసింది.
మే నెలలో జరిగిన 9.41 బిలియన్ల లావాదేవీల ద్వారా 14.89 లక్షల కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయి. 2022 మే నెలతో పోలిస్తే, లావాదేవీల సంఖ్య 2023 మే నెలలో 58% పెరిగింది. అదే కాలంలో, లావాదేవీల మొత్తం విలువ 43% పెరిగింది.
It's 9 Billion+ transactions in May`23! Make seamless payments from your mobile in real-time with UPI. #upichalega #UPI #DigitalPayments @GoI_MeitY @_DigitalIndia @dilipasbe pic.twitter.com/H7qUs7nZ4M
— NPCI (@NPCI_NPCI) June 1, 2023
ఏప్రిల్‌లో 8.89 బిలియన్ల లావాదేవీలు జరిగాయి, రూ. 14.07 లక్షల కోట్లు చేతులు మారాయి. అంతకుముందు నెల మార్చిలో 8.68 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. రూ. 14.10 లక్షల కోట్లు ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌కు మొబైల్ ద్వారా బదిలీ అయ్యాయి. గత మూడు నెలల్లో, యూపీఐ ద్వారా ప్రతి నెలలోనూ రూ. 14 లక్షల కోట్లకు తక్కువ విలువైన లావాదేవీలు జరిగాయి. డేటా ప్రకారం, 2023 ఆర్థిక సంవత్సరంలో 83 బిలియన్ల లావాదేవీలను NPCI ప్రాసెస్ చేసింది, వాటి మొత్తం విలువ రూ. 139 లక్షల కోట్లు. 2022 ఆర్థిక సంవత్సరంలోని రూ. 84 లక్షల కోట్ల విలువైన 38 బిలియన్ల లావాదేవీల నుంచి ఇది పెరిగింది.
2026-27 నాటికి 379 బిలియన్ల లావాదేవీలు
"ది ఇండియన్ పేమెంట్స్ హ్యాండ్‌బుక్ - 2022-27" రిలీజ్ చేసిన మరొక నివేదిక ప్రకారం, 2022-23 కాలంలో, మొత్తం UPI లావాదేవీల పరిమాణంలో రిటైల్ చెల్లింపుల వాటా 75 శాతంగా ఉంది. ఇండియన్ డిజిటల్ పేమెంట్స్ 50 శాతం CAGR వద్ద స్థిరంగా వృద్ధి సాధిస్తున్నాయని ఆ రిపోర్ట్ పేర్కొంది. ఆ లెక్క ప్రకారం, FY 2022-23లో 103 బిలియన్ల నుంచి FY 2026-27లో 411 బిలియన్ల లావాదేవీలకు భారత్ చేరుకుంటుందని అంచనా. 2027 నాటికి ప్రతిరోజూ 1 బిలియన్ డాలర్ల రికార్డు లావాదేవీలు జరుగుతాయని, 2026-27 నాటికి 83.71 బిలియన్ లావాదేవీల నుంచి 379 బిలియన్ లావాదేవీలకు పెరుగుతుందని నివేదిక పేర్కొంది.
క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ పెరుగుతాయి
ఇటీవల, క్రెడిట్ కార్డ్‌లను కూడా యూపీఐకి అనుసంధానం చేయడం వల్ల డిజిటల్ పేమెంట్స్‌లో మరింత వేగం పెరుగుతుంది. ఇకపై, డెబిట్ కార్డ్‌ల కంటే క్రెడిట్ కార్డ్ లావాదేవీలే ఎక్కువగా జరుగుతాయని "ది ఇండియన్ పేమెంట్స్ హ్యాండ్‌బుక్ - 2022-27" నివేదికలో వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి, డెబిట్ కార్డ్‌ల కంటే క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే UPI లావాదేవీలు ఎక్కువగా ఉంటాయని అంచనా. వచ్చే ఐదేళ్లలో క్రెడిట్ కార్డుల జారీ 21 శాతం CAGR వద్ద వృద్ధి చెందుతుందని ఆ రిపోర్ట్ వెల్లడించింది. అయితే డెబిట్ కార్డ్‌ల జారీ మాత్రం 3 శాతం వద్ద స్థిరంగా ఉంటుందని అంచనా వేసింది.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: సిబిల్ స్కోర్ తక్కువైనా ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది, హైకోర్ట్ కీలక నిర్దేశం
Stock Market Today: 19,700 మీదే నిఫ్టీ ముగింపు - 173 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
Renovation Loan: మీ పాత ఇంటిని కొత్తగా మార్చేయండి - రెనోవేషన్ లోన్ రేట్లు, టాక్స్ బెనిఫిట్స్ ఇవిగో!
Cryptocurrency Prices: రెండు వేలు తగ్గిన బిట్‌కాయిన్! మిక్స్డ్ జోన్లో క్రిప్టోలు
Sugar Stocks: పెట్టుబడిని పరుగులు పెట్టించిన షుగర్ స్టాక్స్, ఇదంతా ఇథనాల్ ఎఫెక్టా?
Rs 2 Lakh Pension: మీరు 40ల్లోకి వచ్చారా, రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.2 లక్షల పెన్షన్ పొందాలంటే ఇప్పుడెంత పెట్టుబడి పెట్టాలి?
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్‌కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
/body>