News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Education Loan: సిబిల్‌ స్కోర్‌ తక్కువైనా ఎడ్యుకేషన్‌ లోన్‌ వస్తుంది, హైకోర్ట్‌ కీలక నిర్దేశం

తక్కువ సిబిల్‌ స్కోర్ ఆధారంగా మాత్రమే విద్యార్థి విద్యారుణ దరఖాస్తును తిరస్కరించడం తప్పని చెప్పారు.

FOLLOW US: 
Share:

Education Loan: బ్యాంకు నుంచి ఎలాంటి రుణం పొందాలన్నా మంచి క్రెడిట్‌ స్కోర్‌/సిబిల్‌ స్కోర్ ఉండటం చాలా ముఖ్యం. సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే బ్యాంకులు లోన్లు ఇవ్వవు, అప్లికేషన్‌ రిజెక్ట్ చేస్తాయి. కొన్ని సందర్భాల్లో, విద్యారుణం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు కూడా మంచి సిబిల్‌ స్కోర్ లేని కారణంగా బ్యాంకుల నుంచి తిరస్కారం ఎదురవుతుంది. ఇకపై ఆ దాష్టీకం చెల్లదు. ఈ విషయంలో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

బ్యాడ్‌ సిబిల్‌ స్కోర్‌ (Bad CIBIL Score) ఉన్న కారణంగా, కేరళలోని ఒక విద్యార్థి పెట్టుకున్న ఎడ్యుకేషన్‌ లోన్‌ అప్లికేషన్‌ను ఒక బ్యాంక్‌ తిరస్కరించింది. ఆ విద్యార్థికి హైకోర్టును ఆశ్రయించాడు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ పివి కున్హికృష్ణన్, సదరు బ్యాంకర్‌ను మందలించారు. తక్కువ సిబిల్ స్కోర్ ఆధారంగా విద్యార్థులకు విద్యారుణం తిరస్కరించలేరని వ్యాఖ్యానించారు. విద్యారుణాల దరఖాస్తుల విషయంలో బ్యాంకులు మానవత దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. విద్యార్థుల వల్లే దేశం నిర్మితమైందని జస్టిస్ పివి కున్హికృష్ణన్‌ పేర్కొన్నారు. తక్కువ సిబిల్‌ స్కోర్ ఆధారంగా మాత్రమే విద్యార్థి విద్యారుణ దరఖాస్తును తిరస్కరించడం తప్పని చెప్పారు. 

అసలు విషయం ఏంటి?
కేరళ హైకోర్ట్‌లో పిటిషన్ వేసిన విద్యార్థి, గతంలో రెండు రుణాలు తీసుకున్నాడు. అందులో ఒక రుణం విషయంలో కట్టాల్సిన రూ. 16,667ను గడువు లోగా చెల్లించలేదు. ఇది, ఆ విద్యార్థి సిబిల్‌ స్కోర్‌పై చెడు ప్రభావం చూపింది. ఆ తర్వాత కొంతకాలానికి, ఆ విద్యార్థి ఎడ్యుకేషన్‌ లోన్‌ కోసం బ్యాంక్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. తక్కువ సిబిల్ స్కోర్ కారణం చూపిన ఆ బ్యాంక్‌, అతనికి విద్యారుణం మంజూరు చేయలేదు. అతను కోర్టుకెక్కాడు. తన చదువు కోసం వెంటనే బ్యాంకు రుణం కావాలని, లేదంటే తాను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పిటిషన్‌ పేర్కొన్నాడు. సిబిల్ స్కోర్‌ చూడడానికి బదులు, తీసుకున్న రుణాన్ని భవిష్యత్తులో తిరిగి చెల్లించగల విద్యార్థి సామర్థ్యాన్ని నిర్ధరించుకుని, దాని ఆధారంగా విద్యారుణం ఇవ్వాలని కేరళ హైకోర్ట్‌ బ్యాంకర్‌కు సూచించింది.

ఇప్పుడు, ఒక్క విద్యారుణమే కాదు, వివిధ రకాల బ్యాంక్‌ లోన్ల విషయంలో కేరళ హైకోర్ట్‌ నిర్దేశం కీలకంగా మారుతుంది. ఒక వ్యక్తికి మంచి ఆదాయ వనరులు, ఆస్తిపాస్తులు ఉన్నా అవి సిబిల్‌ స్కోర్‌లో కనిపించవు. అతని రుణ చరిత్ర మాత్రమే కనిపిస్తుంది. ఏదో కారణంతో ఎప్పుడో ఒకసారి గడువులోగా అప్పు తీర్చలేకపోతే సిబిల్‌ స్కోర్‌లో రెడ్‌ మార్క్‌ కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో, తన ఆదాయ వనరులు & ఆస్తిపాస్తులను బ్యాంకర్‌కు చూపించి, నమ్మకం కలిగించి రుణం పొందవచ్చు. 

సిబిల్‌ స్కోర్‌పై శ్రద్ధ పెట్టడం ముఖ్యం
ప్రతి వ్యక్తికి జీవితంలో డబ్బు అవసరం అవుతుంది. రుణం కోసం బ్యాంక్‌కు వెళ్లాల్సి రావచ్చు. ఎడ్యుకేషన్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్‌ లోన్‌ మొదలైనవాటిని ఇచ్చే ముందు బ్యాంకు ఆ వ్యక్తి సిబిల్‌ స్కోర్‌ని చెక్ చేస్తుంది. అప్లికేషన్‌ పెట్టిన వ్యక్తి సిబిల్‌ స్కోర్ సరిగ్గా లేకుంటే లోన్ పొందడంలో సమస్యలు రావచ్చు. తక్కువ సిబిల్‌ స్కోర్‌ మీద ఇచ్చే రుణాలపై బ్యాంకులు ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి. మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నవాళ్లకు తక్కువ వడ్డీకే ఎక్కువ మొత్తంలో లోన్‌ మంజూరు చేస్తాయి. కాబట్టి, CIBIL స్కోర్‌ను సరిగ్గా మొయిన్‌టెయిన్‌ చేయడం చాలా అవసరం. దీనికి ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు ఉన్న అన్ని లోన్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లింస్తే చాలు. దీంతో పాటు, మీరు ఎవరికైనా రుణ హామీదారుగా ఉండాల్సి వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, ఆ వ్యక్తి సకాలంలో లోన్ మొత్తం తిరిగి చెల్లించకపోతే, అది మీ CIBIL స్కోర్‌పై కూడా చెడు ప్రభావం చూపుతుంది.

మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: దివాలా ముప్పు తప్పించుకున్న అగ్రరాజ్యం, సెనెట్‌లోనూ డెట్‌ సీలింగ్‌ బిల్లు పాస్‌ 

Published at : 02 Jun 2023 03:51 PM (IST) Tags: Kerala High Court CIBIL Score Education Loan Credit Score

ఇవి కూడా చూడండి

Best Electric Scooters: దేశంలో టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - కొనాలనుకుంటే ఆప్షన్లలో ఇవి ఉండాల్సిందే!

Best Electric Scooters: దేశంలో టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - కొనాలనుకుంటే ఆప్షన్లలో ఇవి ఉండాల్సిందే!

Money Rules: రెడీగా ఉండండి - అక్టోబర్‌ 1 నుంచి చాలా మార్పులు, నేరుగా మీ డబ్బుపై ప్రభావం

Money Rules: రెడీగా ఉండండి - అక్టోబర్‌ 1 నుంచి చాలా మార్పులు, నేరుగా మీ డబ్బుపై ప్రభావం

Latest Gold-Silver Price 28 September 2023: పాతాళానికి పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price 28 September 2023: పాతాళానికి పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Bank Holiday: గాంధీ జయంతి, దసరా సహా చాలా సెలవులు - అక్టోబర్‌లో బ్యాంకులు సగం రోజులు పని చేయవు

Bank Holiday: గాంధీ జయంతి, దసరా సహా చాలా సెలవులు - అక్టోబర్‌లో బ్యాంకులు సగం రోజులు పని చేయవు

Petrol-Diesel Price 28 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol-Diesel Price 28 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది