అన్వేషించండి

Adani Group Statement: అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన

Adani Group: అమెరికా కోర్టులో కేసుకు సంబంధించి అన్ని అవాస్తవలేనని అదానీ గ్రూప్ ప్రకటించింది. నిరూపణ అయ్యే వరకూ అవన్నీ ఆరోపణలేనని స్పష్టం చేసింది.

Adani Group has declared that all allegations false And baseless : అమెరికా కోర్టులో నమోదైన కేసు గురించి అదానీ గ్రూపు ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ ఆరోపణలన్నీ నిరాధారం వాటిని తిరస్కరిస్తున్నామని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రూపు తరపున అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన

 

నిరూపణ అయ్యే వరకూ అన్నీ ఆరోపణలే !                

"నిరూపణ అయ్యే వరకూ నేరారోపణలు చేసిన వ్యక్తి నేరస్తుడు కాదని, స్వచ్చమైన వ్యక్తేనని" అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ చెబుతున్న విషయాన్ని అదానీ గ్రూప్ గుర్తు చేసింది. ఈ విషయంలో న్యాయపరంగా చేపట్టాల్సిన చర్యలను తీసుకుంటామని అదానీ గ్రూపు తెలిపింది. 

అత్యున్నత విలువలతో నడుస్తున్న సంస్థ అదానీ గ్రూపు               

అదానీ గ్రుపు నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తామని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. గ్రూపు కార్యకలాపాల్లో  పారదర్శకత ఉంటుందని అలాగే తమ గ్రూపు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి చోటా అక్కడి నియమ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటిస్తుందన్నారు. అదాని గ్రూపు న్యాయానికి కట్టుబడి సంస్థ అని స్టాక్ హోల్డర్లు, భాగస్వాములు, ఉద్యోగులుక అదానీ గ్రూపు తెలిపింది. కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని చోట్ల చట్టాలను తగ్గట్లుగానే సంస్థ నడుస్తోందని స్పష్టం చేశారు.  

సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు లంచం ఇచ్చారని అమెరికా కోర్టులో కేసు

భారతదేశంలో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ, సాగర్ ఆర్ అదానీ, వినీత్ ఎస్ జైన్‌ సహా ఏడుగురు $250 మిలియన్ల (రూ. 2,100 కోట్లు) లంచాన్ని అధికారులకు ఆఫర్‌ చేశారంటూ.. అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్‌ కోర్టు అభియోగాలు మోపింది. పెట్టుబడిదార్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధుల సమీకరణ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపించింది.  నిందితులు US పెట్టుబడిదారులకు తప్పుడు ప్రకటనలు చేశారని, ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించారని అభియోగపత్రంలో ఆరోపించారు. అయితే ఇవన్నీ నిరూపణ కాని ఆరోపణలు అని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. 

గతంలోనూ అదానీ గ్రూపుపై అమెరికాకు చెందిన హిండెన్ బెర్గ్ ఆరోపణలు  

గతంలోనూ అమెరికాకు చెందిన హిండెన్ బెర్గ్ సంస్థ అదానీ గ్రూపుపై కొన్ని ఆరోపణలతో ఎటాక్ చేసింది.ఆ సమయంలోనూ అదానీ గ్రూపు షేర్లు భారీగా నష్టపోయాయి. ఆ తర్వాత హిండెన్ బెర్గ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని సెబితో పాటు సుప్రీంకోర్టు విచారణలో తేలింది. దీంతో మళ్లీ అదానీ గ్రూపు కోలుకుంది. ఆ తర్వాత కూడా అదానీ గ్రూపుపై హిండెన్ బెర్గ్ ఆరోపణలు చేసినా మార్కెట్ పట్టించుకోలేదు. ఈ సారి అమెరికా నుంచే అదానీ గ్రూపులో మరో దాడి జరిగింది. ఈ సారి అక్కడ నేరుగా కేసుస నమోదు కావడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఈ కారణంగా అదానీ గ్రూపు షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
IPL 2025 PBKS VS RCB Result Update:  పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి 3వ ఓటమి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs PBKS Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP DesamRohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
IPL 2025 PBKS VS RCB Result Update:  పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి 3వ ఓటమి
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Weather Hyderabad: ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత-  హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌  
ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత- హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌
Lowest scores in IPL:ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
Embed widget