అన్వేషించండి

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు

Andhra Pradesh: ఏపీలో పిల్లలను భిక్షాటన చేయిస్తున్న మాఫియా ఆట కట్టించేందుకు అధికారులు రంగంలోకి దిగారు.వ్యవస్థీకృత మాఫియా ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

Begging Mafia that is begging with children in AP: చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వారితో బిచ్చమెత్తించి ఆ డబ్బులు తాము వాడుకునే రాక్షసుల  గురించి సినిమాల్లోనే చూసి ఉంటాం. కానీ నిజంగానే అలాంటి మాఫియా ఉంది. ఏపీలో ఇలాంటి మాఫియాను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. చిన్న పిల్లవాడు ఒంటి నిండా రంగు పూసుకుని గాంధీ అవతారంలో రోడ్డుపై కునికి పాట్లు పడుతున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో చూసి నారా లోకేష్ చలించిపోయారు. వెంటనే ఎవరో ఏంటో తెలుసుకోవాలని.. ఎందుకు అలా భిక్షాటన  చేయాల్సి వస్తుందో గుర్తించాలని ఆదేశించారు. 

కర్నూలులో ఆ పిల్లవాడి కోసం వెదుకుతున్న పోలీసులకు అలాంటి వారు చాలా చోట్ల కనిపించారు.  శ‌రీరానికి రంగు పూసుకుని భిక్షాట‌న చేస్తున్న మ‌రి కొంద‌రు చిన్నారుల‌ను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని, వివ‌రాలు సేక‌రించారు. అంతా వ్యవస్థీకృతంగా జరుగుతున్న మాఫియాగా గుర్తించారు. ఆ పిల్లల తల్లిదండ్రులను గుర్తించి వారికి అప్పగించారు. అయితే ఈ బిచ్చగాళ్ల మాఫియా వెనుక ఉన్నది ఎవరో బయటకు లాగేందుకు ఆపరేషన్ ప్రారంభించారు.          

Also Read:  ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్

నిజానికి ఒక్క కర్నూలులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి బిచ్చగాళ్ల మాఫియాలు ఉంటాయి. అన్ని  రకాల వయసుల వాళ్లు ఇందులో ఉంటారు. చంటి బిడ్డలను వేసుకుని కొంత మంది మహిళలు రోడ్డు మీదకు వస్తారు. నిండు గర్భిణి వేషంతో మరికొంత మంది వస్తారు. రూపాయి చేయని పెన్నును పది రూపాయలు పెట్టి కొనాలని దీనంగా అడిగేవారూ ఉంటారు. ఇదంతా ఓ బెగ్గింగ్ మాఫియా అని చాలా మందికి తెలుసు. అయినా కొంత మంది డబ్బులు ఇస్తూంటారు. పోలీసులు పట్టించుకోరు. ఈ మాఫియాను నడిపే వ్యక్తులు లక్షలు వెనకేసుకుంటూ ఉంటారు. పిల్లల్ని పావులుగా పెట్టుకుంటూ ఉంటారు. 

Also Read: సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు

బెగ్గర్లు లక్షాధికారులుగా ఉన్నారని అనేక చోట్ల నుంచి వార్తలు వస్తున్నాయి. ముంబైలో ఒక్కో బెగ్గర్ లక్షలు సంపాదిస్తారు. లక్నోలో బెగ్గర్లకు ఐ ఫోన్లు కూడ ఆంటాయి. అక్కడ ఓ మాఫియాలాగా వ్యవస్థీకృతంగా ఉందో లేదో ఏపీలో మాత్రం పిల్లల జీవితాలను నాశనం చేస్తూ.. ఏమీ తెలియని వయసులో  కూడా వారి ఒంటికి రంగులేసి భిక్షాటనకు పంపుతున్నారు. ఈ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి.                                                                            

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget