అన్వేషించండి

Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు

Telangana News: ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ రోజు కరీంనగర్‌లో జరిగే దీక్షలో ఆయన పాల్గొననున్నారు.

KTR Call For Diksha Divas On 29th November: తెలంగాణవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 29న 'దీక్షాదివాస్' (Diksha Divas) ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్వరాష్ట్ర సాధనలో రాష్ట్ర ప్రజలకు ఇది అత్యంత కీలక ఘట్టంగా నిలుస్తుందని అన్నారు. 2009, నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి ప్రత్యేక రాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని చెప్పారు. ఈ దీక్ష యావత్ భారతదేశ రాజకీయ వ్యవస్థను కదిలించిందని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసిందని పేర్కొన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజలు చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని చెప్పారు. ఈ నెల 29న కరీంనగర్‌లో జరిగే దీక్షా దివస్‌లో కేటీఆర్ పాల్గొననున్నారు.

మహాధర్నాకు నో పర్మిషన్.. కేటీఆర్ ట్వీట్

మరోవైపు, వికారాబాద్ జిల్లా లగచర్లలో బాధిత రైతులకు సంఘీభావంగా.. మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ గురువారం మహా ధర్నా తలపెట్టింది. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కావాలనుకున్న ఈ నిరసనకు పోలీసులు అనుమతివ్వలేదు. అయితే, మహబూబాబాద్‌లో పోలీసుల లాంగ్ మార్చ్‌పై కేటీఆర్ స్పందించారు. 'ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు. ఎలాంటి గొడవలు జరగలేదు. మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఎందుకు.?. వార్నింగ్‌లు ఎందుకు.?. అసలు మానుకోటలో ఏం జరుగుతోంది.?. శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది.?. ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల, రాక్షస, నియంత పాలన. ఖబడ్దార్ రేవంత్. ఇది తెలంగాణ. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది.' అని ట్వీట్ చేశారు.

మరోవైపు, మహాధర్నా కోసం బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ధర్నాకు అనుమతి వచ్చినట్లు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ గిరిజన మహా ధర్నా చేసుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం అనుమతిచ్చినట్లు పేర్కొంటున్నారు. అయితే, బీఆర్ఎస్ మహా ధర్నాపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో వికారాబాద్‌లో ఘటన జరిగితే మహబూబాబాద్‌లో మహా ధర్నా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ఇక్కడ చిచ్చు పెడుతోందని మండిపడ్డారు.

Also Read: Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
Embed widget