అన్వేషించండి

US: దివాలా ముప్పు తప్పించుకున్న అగ్రరాజ్యం, సెనెట్‌లోనూ డెట్‌ సీలింగ్‌ బిల్లు పాస్‌

ప్రతినిధుల సభలో బుధవారం నాడు ఈ బిల్లును ఆమోదించారు. సెనేట్‌ కూడా గురువారం బిల్లును పాస్‌ చేసింది.

US Debt Ceiling: ఉత్కంఠ వీడింది. అగ్రరాజ్యం అమెరికా, దివాలా గండాన్ని తృటిలో తప్పించుకుంది. U.S. ప్రభుత్వ మొట్టమొదటి సార్వభౌమ రుణ దివాలాకు (sovereign debt default) డిఫాల్ట్‌కు కేవలం మూడు రోజుల ముందు, రుణ పరిమితిని (Debt ceiling) పెంచడానికి సెనేట్‌ కూడా ఒప్పుకుంది. దీంతో, యూఎస్‌ డెట్‌ సీలింగ్‌ పెంపు బిల్లుకు ఉభయ సభలు ఆమోదముద్ర వేసినట్లు అయింది. 

ప్రతినిధుల సభలో బుధవారం నాడు ఈ బిల్లును ఆమోదించారు. సెనేట్‌ కూడా గురువారం బిల్లును పాస్‌ చేసింది. ఇప్పుడు ఆ బిల్లు యూఎస్‌ ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ (US President Joe Biden) టేబుల్‌ పైకి వెళుతుంది. అధ్యక్షుడు సంతకం కాగానే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. దీంతో, దేశీయంగా, విదేశాల నుంచి అప్పులు తెచ్చుకునే పరిమితిని పెంచుకునేందుకు యూఎస్‌ గవర్నమెంట్‌కు అవకాశం లభిస్తుంది. 

63-36 ఓట్ల తేడాతో సెనేట్‌ ఆమోదం
రుణ పరిమితి పెంపు బిల్లును 63-36 ఓట్ల తేడాతో సెనేట్‌ ఆమోదించింది. బిల్‌ పాస్‌ కావాలంటే కనీసం ఆ హౌస్‌లో కావల్సిన కనీస 60 ఓట్ల థ్రెషోల్డ్‌ను డెమొక్రాట్లు అధిగమించారు. ప్రభుత్వం చేస్తున్న వ్యయాలపై పరిమితి విధించాలన్నది గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చల్లో ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న డిమాండ్‌. వివిధ దఫాల చర్చల తర్వాత, వ్యయాలపై రెండేళ్ల పాటు పరిమితి విధించడానికి అధికార పక్షం ఒప్పుకుంది. దీంతో రెండు వర్గాల మధ్య సంధి కుదిరింది, కావలసిన ఓట్లు పడ్డాయి. అయితే, సభ ఆమోదించిన ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్‌కు 11 ప్రతిపాదిత సవరణలను కూడా సభ ఆమోదించింది. అంటే, బిల్లు పాస్‌ అయినప్పటికీ, ఆ 11 సవరణలను చేయాల్సి ఉంటుంది.

$31.4 లక్షల కోట్ల డాలర్లకు రుణ పరిమితి పెంపు 
2021 నాటికి, US గవర్నమెంట్‌ తీసుకున్న రుణాలు $28.5 లక్షల కోట్లకు (రూ.23,53,09,680 కోట్లు) చేరాయి. అగ్రరాజ్య DGP కంటే ఈ రుణ మొత్తం 24 శాతం ఎక్కువ. ఉదాహరణకు.. పెద్దన్నకు ఆదాయం 100 రూపాయలు వస్తే, చేసిన అప్పు 124 రూపాయలు. ఈ రుణంలో దాదాపు $22 లక్షల కోట్లను గవర్నమెంట్‌ బాండ్స్‌/సెక్యూరిటీల జారీ రూపంలో స్వదేశంలోని వ్యక్తులు, సంస్థల నుంచి సేకరించింది. మిగిలిన దాదాపు $7 లక్షల కోట్లను విదేశీ అప్పుల రూపంలో తెచ్చుకుంది.  ప్రస్తుతం, US డెట్‌ సీలింగ్‌ $31.4 లక్షల కోట్లు. అంటే, $31.4 లక్షల కోట్ల డాలర్ల వరకు దేశ, విదేశాల నుంచి ప్రభుత్వం అప్పులు తెచ్చుకోవచ్చు. అవసరాలకు తగ్గట్లుగా, ఈ పరిమితిని దఫదఫాలుగా పెంచుకుంటూ ఈ స్థాయికి చేర్చారు. ఇప్పుడు, ఈ పరిమితి కూడా సరిపోదని బైడెన్‌ గవర్నమెంట్‌ భావించింది. వచ్చే ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, బైడెన్‌ ప్రభుత్వం వివిధ పథకాల రూపంలో విపరీతంగా ఖర్చు చేస్తోంది. ఇందుకు అవసరమైన డబ్బుల సేకరణ కోసమే డెట్‌ సీలింగ్‌ పెంపు కోసం ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతమున్న పరిమితిని సైతం దాటి అప్పులు చేయడానికి కాంగ్రెస్‌ అనుమతి కోరింది. అప్పు పరిమితి పెంచేందుకు రిపబ్లికన్లు తొలుత ఒప్పుకోకపోవడంతో కొన్ని రోజులుగా ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ, అమెరికా ప్రభుత్వం దివాలా తీస్తే, ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతుంది. ఇప్పుడు, రెండు వర్గాల మధ్య రాజీ కుదిరి బిల్లు పాస్‌ కావడంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది.

రుణ సీలింగ్ సంక్షోభానికి ఫుల్‌స్టాప్‌ పడడంతో, కాంగ్రెస్ తన దృష్టిని కేటాయింపుల పైకి మళ్లిస్తుంది. రుణాల రూపంలో తీసుకొచ్చే డబ్బును ఎలా ఖర్చు చేయాలా అని ఆలోచిస్తుంది.

మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: జనం దగ్గర అంత డబ్బుందా?, పీక్‌ రేంజ్‌లో పింక్‌ నోట్ల డిపాజిట్లు

టాప్ హెడ్ లైన్స్

EPFO: ఇంట్లోనే ఉండి మీ PF ఖాతా మొబైల్ నంబర్‌ మార్చుకోవచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే
ఇంట్లోనే ఉండి మీ PF ఖాతా మొబైల్ నంబర్‌ మార్చుకోవచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే
Vehicle Modification Rules: వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి
వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి
Train Ticket Rules: రైలు టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా రెట్టింపు, కొన్ని సందర్భాలలో జైలు శిక్ష సైతం
రైలు టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా రెట్టింపు, కొన్ని సందర్భాలలో జైలు శిక్ష సైతం
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana New CS: తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు! గతంలో ఇక్కడ పనిచేసిన ఐఏఎస్
తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు! గతంలో ఇక్కడ పనిచేసిన ఐఏఎస్
Telangana ACB: అవినీతి తిమింగలాలపై ఏసీబీ యుద్ధం - ఈ దాడులు ట్రైలర్లే - అసలు బడా బాబుల సంగతి త్వరలో తేల్చబోతున్నారా?
అవినీతి తిమింగలాలపై ఏసీబీ యుద్ధం - ఈ దాడులు ట్రైలర్లే - అసలు బడా బాబుల సంగతి త్వరలో తేల్చబోతున్నారా?
Union Cabinet Expansion: మోదీ కేబినెట్‌లోకి కొత్త ముఖాలు ! రేసులో రాఘవ్ చద్దా.. 5 రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ మెగా ప్లాన్!
మోదీ కేబినెట్‌లోకి కొత్త ముఖాలు ! రేసులో రాఘవ్ చద్దా.. 5 రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ మెగా ప్లాన్!
Monsoon Diet Tips : వర్షాకాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవట
వర్షాకాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవట
OPS For AP Employees: ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాత పెన్షన్ పునరుద్ధరణ, ఒక్క ఉద్యోగికి రూ. 3.39 కోట్ల మేర ప్రయోజనం
ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాత పెన్షన్ పునరుద్ధరణ, ఒక్క ఉద్యోగికి రూ. 3.39 కోట్ల మేర ప్రయోజనం
SIR Process Telangana: తెలంగాణలో 89 లక్షల ఓట్ల తొలగింపు ఖాయమేనా? హైదరాబాద్‌లో సగం ఓట్లు తగ్గిపోతాయా? ఏంటి SIR ఇది?
తెలంగాణలో 89 లక్షల ఓట్ల తొలగింపు ఖాయమేనా? హైదరాబాద్‌లో సగం ఓట్లు తగ్గిపోతాయా? ఏంటి SIR ఇది?
Telangana ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.60 లక్షల నుంచి 2 కోట్ల వరకు ప్రమాద బీమా ప్రయోజనం
Telangana ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.60 లక్షల నుంచి 2 కోట్ల వరకు ప్రమాద బీమా ప్రయోజనం
Ram Charan : మా బుడ్డది పెద్ది అంటోది - అసలు పేరు మర్చిపోతారేమో... రామ్ చరణ్ ఎమోషనల్
మా బుడ్డది పెద్ది అంటోది - అసలు పేరు మర్చిపోతారేమో... రామ్ చరణ్ ఎమోషనల్
Embed widget