News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

₹2000 Notes: జనం దగ్గర అంత డబ్బుందా?, పీక్‌ రేంజ్‌లో పింక్‌ నోట్ల డిపాజిట్లు

ఎక్కువ మంది ప్రజలు పెద్ద నోట్ల మార్పిడికి బదులు ఖాతాల్లో డిపాజిట్‌ చేయడానికే మొగ్గు చూపుతున్నారు.

FOLLOW US: 
Share:

₹2000 Note Deposits: చెలామణి నుంచి రూ. 2,000 ఉపసంహరించుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకున్న వారం రోజులకే వేల కోట్ల రూపాయలు మార్కెట్‌ నుంచి కనుమరుగయ్యాయి. మొత్తం రూ. 36,492 కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు చలామణిలో లేకుండా పోయాయి. దీనర్ధం, కేవలం వారం వ్యవధిలోనే బ్యాంకుల్లోకి రూ. 36 వేల కోట్లకు పైగా డిపాజిట్లు వచ్చాయి. 

RBI లేటెస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ ప్రకారం, 26 మే 2023 నాటికి, మార్కెట్‌లో చెలామణిలో ఉన్న కరెన్సీ (CIC) విలువ రూ. 34.4 లక్షల కోట్లు. ఒక వారంలో ఈ విలువ నుంచి రూ. 36,492 కోట్లు తగ్గింది. CICలో పతనం బ్యాంకింగ్ వ్యవస్థలో తక్కువ డబ్బు చలామణీని ప్రతిబింబిస్తుంది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, ఎక్కువ మంది ప్రజలు పెద్ద నోట్ల మార్పిడికి బదులు ఖాతాల్లో డిపాజిట్‌ చేయడానికే మొగ్గు చూపుతున్నారు.

రూ.లక్ష కోట్ల వరకు వస్తాయని అంచనా
'ది హిందూ' రీసెర్చ్‌ రిపోర్ట్‌ ప్రకారం, 2023 మార్చి నాటికి, భారతదేశంలో రూ. 3.7 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు చలామణీలో ఉన్నాయి. చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ. 2 వేల నోట్ల వాటా 10.8%. వీటిలో కనీసం మూడింట ఒక వంతు నోట్లు బ్యాంకులకు తిరిగి వెళితే, బ్యాంకు డిపాజిట్లు అదనంగా రూ.40 వేల కోట్ల నుంచి రూ.1.1 లక్షల కోట్లకు పెరగవచ్చని అంచనా. ప్రస్తుతం, రూ. 2000 నోట్లు భారీ సంఖ్యలో బ్యాంకుల వద్దకు తిరిగి వస్తున్న నేపథ్యంలో, రూ. 50 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల మేర వెనక్కి వస్తాయని ఆర్థిక నిపుణులు లెక్కగట్టారు. అయితే, కేవలం వారం రోజుల్లోనే రూ. 36 వేల కోట్లకు పైగా కరెన్సీ తిరిగి వచ్చింది.

SBI వద్ద రూ.14 వేల కోట్ల విలువైన నోట్లు జమ
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ రుణదాత అయిన స్టేట్‌ బ్యాంక్ వద్దకు, వారం రోజుల్లో, 14 వేల కోట్ల రూపాయల విలువైన 2 వేల రూపాయల నోట్లు జమ అయ్యాయి. వీటిని విలువలో కాకుండా నంబర్‌లో రూపంలో చెప్పుకుంటే, 7 కోట్ల నోట్లను ప్రజలు డిపాజిట్‌ చేశారు. కేవలం నోట్ల మార్పిడి వరకే చూసుకుంటే, ఈ ఏడు రోజుల్లో, అన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ల ద్వారా దాదాపు రూ. 3000 కోట్ల విలువైన నోట్లను ప్రజలు మార్చుకున్నారు. దీనిని కూడా నంబర్‌ రూపంలో చెప్పుకుంటే, ఇప్పటి వరకు ఒక కోటి 50 లక్షల పెద్ద నోట్లను చిన్న నోట్ల రూపంలోకి మార్పిడి చేసుకున్నారు. మార్కెట్‌లో చలమణీలో ఉన్న మొత్తం రూ. 2000 నోట్లలో, వారం రోజుల్లో, 20 శాతం నోట్లు స్టేట్‌ బ్యాంక్‌ వద్దకు వచ్చాయని బ్యాంక్‌ అధికారులు చెప్పారు.

రూ.2 వేల నోట్లు చెల్లుతాయి
రూ. 2,000 కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే నెల 19వ తేదీన రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. బ్యాంక్‌ ఖాతాల్లోకి పింక్‌ నోట్ల డిపాజిట్ లేదా చిన్న నోట్లుగా మార్చుకోవడం 23 మే 2023 నుంచి ప్రారంభమైంది. ఇందుకు ఈ ఏడాది సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ఆర్‌బీఐ గడువు ఇచ్చింది. పింక్‌ కరెన్సీ నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఉపసంహరించుకుంది తప్ప రద్దు చేయలేదు. కాబట్టి, ఇప్పటికీ రూ. 2000 నోట్లు చట్టబద్ధమైన కరెన్సీగానే కొనసాగుతాయి. వాటిని బ్యాంక్‌ల్లో డిపాజిట్‌ చేయడంతో పాటు, అన్ని రకాల లావాదేవీల కోసం ప్రజలు ఉపయోగించవచ్చు. 

మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: ప్రధాని లాంచ్‌ చేసిన ₹75 నాణేలను ఎలా కొనాలి?

Published at : 02 Jun 2023 12:21 PM (IST) Tags: SBI 2000 rupee notes Deposit rules exchange

ఇవి కూడా చూడండి

Petrol - Diesel Rates Today: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol - Diesel Rates Today: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Gold-Silver Prices Today: జాబ్స్‌ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: జాబ్స్‌ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్‌ చేతిలో ఉంటే చాలు, టాప్‌ క్లాస్‌ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి

Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్‌ చేతిలో ఉంటే చాలు, టాప్‌ క్లాస్‌ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి

Forex Reserves: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్‌ మార్క్‌ దాటిన ఫారెక్స్‌ నిల్వలు

Forex Reserves: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్‌ మార్క్‌ దాటిన ఫారెక్స్‌ నిల్వలు

టాప్ స్టోరీస్

General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

General elections in February :  ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ?  కేంద్ర  ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - విశ్వసనీయ వర్గాల వెల్లడి

ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - విశ్వసనీయ వర్గాల వెల్లడి

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి