Human Metapneumovirus : హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ లక్షణాలివే.. చైనాలో డేంజర్ బెల్స్ మోగిస్తోన్న వైరస్, కిక్కిరిసిన ఆస్పత్రులు, శ్మశానవాటికలు
China New Virus : కొవిడ్ సంక్షోభం మరోసారి రానుందా? చైనా మరోసారి డేంజర్ వైరస్‌తో తెరపైకి వచ్చిందా? అసలు మెటాప్న్యూమోవైరస్ అంటే ఏంటి? దాని లక్షణాలు, చికిత్స, మరిన్ని విషయాలివే.
HMPV Symptoms and Prevention Tips : కరోనా వైరస్ వచ్చి దాదాపు ఐదేళ్లు అవుతోంది. ఇప్పుడు తాజాగా చైనా కొత్త వైరస్ వ్యాప్తితో కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తూ ప్రాణాలు హరిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కలకలం రేపుతోంది. గతంలో ఇన్ఫ్లూయేంజా ఎ, మైకోప్లాస్మా న్యుమోనియా, కొవిడ్ - 19 వంటి వైరస్ల వ్యాప్తితో బెంబేలెత్తిన చైనా.. ఇప్పుడు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ వ్యాప్తిని ఎదుర్కొంటుంది.
'SARS-CoV-2 (Covid-19)' అనే X హ్యాండిల్ ద్వారా ఈ న్యూస్ బయటకి వచ్చింది. "చైనా ఇన్‌ఫ్లుఎంజా ఏ, హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్-HMPV, మైకోప్లాస్మా న్యుమోనియా, కొవిడ్-19తో సహా బహుళ వైరస్ల వ్యాప్తిని ఎదుర్కొంటోంది. ఆస్పత్రులు, శ్మశానవాటికలు నిండిపోయినట్లు దానిలో రాసుకొచ్చారు.
⚠️ BREAKING:
— SARS‑CoV‑2 (COVID-19) (@COVID19_disease) January 1, 2025
China 🇨🇳 Declares State of Emergency as Epidemic Overwhelms Hospitals and Crematoriums.
Multiple viruses, including Influenza A, HMPV, Mycoplasma pneumoniae, and COVID-19, are spreading rapidly across China. pic.twitter.com/GRV3XYgrYX
కొత్త వైరస్ వ్యాప్తికి సంబంధించిన రిపోర్టులు, సోషల్ మీడియా పోస్ట్‌లు వైరస్ వ్యాప్తిపై ఆందోళనను కలిగిస్తున్నాయి. అయితే హ్యూమన్ మోటాప్న్యూమోవైరస్ మాత్రమే కాకుండా ఇన్ఫ్లూఎంజా ఎ, మైకోప్లాస్మా న్యుమోనియా, కొవిడ్ వంటి వైరస్‌లన్నీ వ్యాపిస్తున్నట్లు సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ వేగంగా వ్యాపించడమే కాకుండా.. ఫ్లూ వంటి కొవిడ్ లక్షణాలను కలిగిస్తుందని చెప్తున్నారు. వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ వ్యాప్తి దేనివల్ల జరుగుతుందో ఇప్పటికీ తెలియలేదు. అందుకే ఆ దేశ డీసిజ్ కంట్రోల్ అథారిటీ వైరస్‌ను కంట్రోల్ చేయడానికి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే ఆస్పత్రులు, శ్మశానవాటికలు కిక్కిరిసినట్లు తెలుస్తుంది. కోవిడ్ తర్వాత చైనా ఈ కొత్త వైరస్‌ను విజృంభనను ఎదుర్కొంటోంది. దీంతో అక్కడ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించింది ప్రభుత్వం.
నివేదికల ప్రకారం.. చైనా డీసిజ్ కంట్రోల్ అథారిటీ వింటర్లో వచ్చే శ్వాసకోశ వ్యాధుల కేసులు, న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయని భావించినట్లు తెలిపింది. తెలియని వ్యాధికారకాలను కంట్రోల్ చేయడానికి, ప్రోటోకాల్‌ను సెటప్ చేయడంలో అధికారులు బిజీగా ఉన్నట్లు అథారిటీ తెలిపింది. నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్‌కు ఈ వైరస్ల సాంపిల్స్‌ను నివేదించారు. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల డేటా డిసెంబర్ మూడోవారంలో అంటువ్యాధుల పెరుగుదలను సూచించిందని అధికారికంగా తెలిపింది. కానీ వైరస్ గురించిన ప్రస్తావన ఇవ్వలేదు.
వ్యాప్తి, లక్షణాలు
తాజాగా కనుగొన్న రైనోవైరస్, హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిలోనే ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. పెద్దలలో రోగనిరోధశక్తిని తగ్గిస్తున్నట్లు గుర్తించారు. జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ లక్షణాలు కలిగి ఉన్న ఈ వైరస్‌కు టీకా లేదు. ఈ వైరస్ కోసం యాంటీవైరల్ మందులను వైద్యుల సలహా లేకుండా ఉపయోగించవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
బ్రోన్కైటిస్, న్యూమోనియా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. వైద్యుల సలహా తీసుకోవాలి. వైరస్ వ్యాపించకుండా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే వైరస్ సోకిన వ్యక్తికి దూరంగా ఉండాలి.