దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుంది. తాజాగా హైదరాబాద్లో కూడా కేసులు బయటపడ్డాయి. కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ వేరియంట్ లక్షణాలు మీలో ఉంటే వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోండి. దగ్గు, అలసట, ముక్కు దిబ్బడ, ముక్కుకారడం వంటి లక్షణాలు ఉంటే జాగ్రత్త. అతిసారం, తలనొప్పులు కూడా కొవిడ్ జెఎన్ 1 లక్షణాలే. ఈ వేరియంట్ ప్రాణాంతకమైనదా కాదా అంటే కొందరు మాత్రం జాగ్రత్తగా ఉండాలట. ఈ వేరియంట్ రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. (Images Source : Unsplash)