విటమిన్ డి కొవ్వులో కరిగే విటమిన్. శరీరం కాల్షియం శోషణకు, శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా విటమిన్ డి అవసరం. విటమిన్ డి తగ్గితే శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ప్రాథమికంగా ఎముకలు, కండరాల మీద ప్రభావం చూపుతుంది. విటమిన్ డి లోపించడానికి రెండు కారణాలుంటాయి. ఆహారంలో విటమిన్ డి లేకపోవడం, తగినంత సూర్యరశ్మి తగలకపోవడం. విటమిన్ డి నాడీ వ్యవస్థ పనితీరుకు, ఎముకలు, కండరాల పటిష్టానికి, ఇమ్యూనిటి పెరిగేందుకు అవసరం. విటమిన్ డి తగ్గితే నిరంతరం నీరసంగా ఉండడం, చర్మం పాలిపోవడం ప్రాథమికంగా కనిపించే లక్షణాలు. విటమిన్ డి లోపం వల్ల నిద్ర, ఆకలి కూడా ప్రభావితమవుతాయి. కండరాలు బలహీన పడతాయి. ఎటువంటి కారణం లేకుండా ఒళ్లు నొప్పులు వస్తాయి. విటమిన్ డి లోపం వల్ల మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది రోగనిరోధక వ్యవస్థ బలహీన పడడం వల్ల ఆకలి మందగిస్తుంది. Images courtesy: Pexels