యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆహారం తీసుకుంటే జీవక్రియలు మెరుగ్గా ఉంటాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ నిరోధించబడుతుంది.

ఆంథోసియానిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కలిగిన అన్ని రకాల బెర్రీలు బరువు తగ్గేందుకు, ఇన్ఫ్లమేషన్ నిరోధానికి దోహదం చేస్తాయి.

గ్రీన్ టీలో కెటాచిన్ పుష్కలం. జీవక్రియల వేగం పెంచి కొవ్వు కరిగిస్తుంది.

గ్రీన్ టీలో ఉండే కొద్దిపాటి కెఫిన్ వర్కవుట్ సామర్థ్యాన్ని పెంచుతుంది.

హైక్వాలిటీ డార్క్ చాక్లెట్ లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలున్న ఫ్లవానాయిడ్స్ ఉంటాయి. క్రేవింగ్స్ ను అదుపు చేసి బరువు తగ్గిస్తాయి.

బాదం, వాల్నట్ వంటి గింజలన్నీంటిలోనూ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

ప్రొటీన్లతో పాటు, ఆరోగ్యవంతమైన కొవ్వుల వల్ల ఆకలి అదుపులో ఉంటుంది.

సాల్మన్, మ్యాకరెల్ వంటి ఫ్యాట్ కలిగిన చేపల్లో ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు ఎక్కువ.

బచ్చలి, పాల కూర వంటి ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

కాఫీలో ఉండే క్లోరోజెనిక్ ఆసిడ్ లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. జీవక్రియలను మెరుగుపరుస్తుంది.

నారింజలో ఉండే విటమిన్ సి యాంటీఆక్సిడెంట్. ఇది బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.
Image courtesy: Pexels