Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Priyanka Gandhi Vadra News: ఎంపీగా తొలిసారి పార్లమెంట్‌లో అడుగు పెట్టిన ప్రియాంకా గాంధీ ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఓ చేతిలో రాజ్యాంగం పట్టుకొని ఆమె పదవీని స్వీకరించారు.
Priyanka Gandhi Today News: కేరళలోని వాయనాడ్ నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విజయం సాధించారు. ఆమె ఈరోజు పార్లమెంటు సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రియాంక గాంధీ పదవీ ప్రమాణం చేస్తున్నప్పుడు సోదరుడు రాహుల్, తల్లి సోనియా అక్కడే ఉన్నారు. ప్రియాంక గాంధీ కుమారుడు కుమార్తె రెహాన్ వాద్రా, మిరాయా వాద్రా కూడా పార్లమెంట్‌కు వచ్చారు. తన తల్లి సోనియాగాంధీ ముందు ప్రమాణం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు.
చేతిలో రాజ్యాంగ పుస్తకంతో ప్రియాంక గాంధీ
ప్రియాంక గాంధీ పేరును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పిలిచిన వెంటనే, ఆమె చేతిలో రాజ్యాంగ పుస్తకంతో వచ్చి ప్రమాణం చేశారు. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్ ఉపఎన్నికల్లో ప్రియాంక భారీ ఆధిక్యంతో విజయం సాదించారు. ఇవాల్టి నుంచి గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పార్లమెంటులో కనిపించనున్నారు.
मैं प्रियंका गांधी वाड्रा...
— Congress (@INCIndia) November 28, 2024
जो लोक सभा की सदस्य निर्वाचित हुई हूं, सत्यनिष्ठा से प्रतिज्ञान करती हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी।
मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूं, उसके… pic.twitter.com/3iN7PHwuIq
గురువారం లోక్‌సభలో వాయనాడ్ పార్లమెంటు సభ్యురాలిగా ప్రియాంక గాంధీ వాద్రా ప్రమాణ స్వీకారంతో అధికారికంగా పార్లమెంటరీలోకి ప్రవేశించారు. ఇటీవల జరిగిన వాయనాడ్ ఉపఎన్నికల్లో ఆమె అఖండ విజయం సాధించారు. ఇప్పుడు ప్రమాణం చేసిన ప్రియాంక లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో జత కలిసి చేరారు.
Also Read: వయనాడ్‌లో ప్రియాంక గాంధీ జయభేరి - రాహుల్ రికార్డ్ బ్రేక్ చేసి చారిత్రాత్మక గెలుపు
ప్రియాంక గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి రాహుల్ గాంధీ సాధించన మెజార్టీని అధికమించి అద్భుత విజాయన్ని సొంతం చేసుకున్నారు. నాలుగు లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యతతో వయనాడ్ లోక్‌సభ సీటును కైవసం చేసుకున్నారు. సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ అభ్యర్థి సత్యన్ మోకేరిని ఓడించి ఎన్నికల్లో తొలి అడుగుతోనే రికార్డులు బద్దలు కొట్టారు.
వాయనాడ్‌కు చెందిన కాంగ్రెస్ నేతలు న్యూఢిల్లీలో ప్రియాంక గాంధీకి ఎన్నికల సర్టిఫికేట్‌ను రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా రాహుల్ తన సోదరికి మిఠాయిలు తినిపించి మరోసారి శుభాకాంక్షలు చెప్పారు. ప్రియాంక గాంధీ తన విజయం స్పందిస్తూ.. "వయనాడ్ ప్రజల మద్దతు, నమ్మకానికి నేను చలించిపోయాను. ఈ అందమైన నియోజకవర్గం సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను" అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో తిరుగులేని కృషి చేసిన స్థానిక కాంగ్రెస్ నాయకులను కూడా ఆమె ప్రశంసించారు.వయనాడ్ కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపిన ప్రియాంక... స్థానిక సమస్యలను పరిష్కరించడం, నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించడంపై దృష్టి పెట్టారు. .
నాందేడ్ ఎంపీగా ప్రమాణం చేసిన కాంగ్రెస్ నేత రవీంద్ర వసంతరావు చవాన్ పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాందేడ్ లోక్‌సభ ఉపఎన్నికలో చవాన్ 5,86,788 ఓట్లతో గెలుపొందారు. రెండు ఉపఎన్నికల విజయాలు కాంగ్రెస్‌కు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. రెండూ కూడా బలమైన నియోజక వర్గాలు కావడం కాంగ్రెస్ శ్రేణులకు బూస్ట్‌లా పని చేయనున్నాయి.
Also Read: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా