Maharashtra Political Crisis: 'పవార్‌నే బెదిరిస్తారా? ఇక బలపరీక్షలోనే తేల్చుకుంటాం- దమ్ముంటే రండి'
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయం మరింత ముదురుతోంది. రెబల్ ఎమ్మెల్యేలను దమ్ముంటే మహారాష్ట్రకు రావాలని శివసేన సవాల్ విసిరింది.
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను భాజపా బెదిరిస్తోందని సంజయ్ ఆరోపించారు. పవార్‌ను బెదిరించి మహారాష్ట్రలో తిరగగలరా అంటూ సవాల్ విసిరారు.
"A central minister of the BJP has said that if attempts are made to save MVA govt, then Sharad Pawar will not be allowed to go home. Whether or not the MVA govt survives, use of such language for Sharad Pawar is not acceptable," tweets Shiv Sena leader Sanjay Raut. pic.twitter.com/IjPpiQsBdC
— ANI (@ANI) June 24, 2022
ఎమ్మెల్యేలకు అల్టిమేటం
మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలకు సంజయ్ రౌత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముంబయికి చేరుకునే అవకాశం ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు రాలేదని. ఇక బలపరీక్షలోనే తేల్చుకుంటామన్నారు.
We won't relent...we'll win on floor of the house (State Assembly). If this battle is fought on roads, we'll win that too. We gave opportunity to those who left, now it's too late. I challenge them to come on floor of the house. MVA govt will complete rest of 2.5 yrs: Sanjay Raut pic.twitter.com/OmWtjmuZrs
— ANI (@ANI) June 24, 2022
Also Read: CM Shivraj Chouhan: మధ్యప్రదేశ్ సీఎం మాస్ స్టెప్పులు- ఏం డ్యాన్స్ ఏసినవ్ కాకా!