అన్వేషించండి

Ashwin Retirement: "స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్

Ravichandran Ashwin: ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ టెస్టులలో భారత్ తరఫున అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వడమే కాక.. వన్డే, టీ20ల్లోనూ తన సత్తా చాటాడు.

Ravichandran Ashwin The Backbone of Indias Bowling: టీమిండియా దశాబ్దాల పాటు క్రికెట్ ను శాసించిందంటే దానికి ప్రధాన కారణం స్పిన్ బౌలింగ్. బిషన్ సింగ్ బేడీ, దిలీప్ జోషీ, శివరామకృష్ణన్, అనిల్ కుంబ్లే, హర్భజన్ వంటి దిగ్గజ భారత స్పిన్నర్ల వారసత్వాన్న కొనసాగించే బాధ్యత రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) పై పడింది. భారత జట్టు వెన్నుముకగా నిలిచి ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు.  అశ్విన్ 106 టెస్టులు, 116 వన్డేలు, 65 T20లు ఆడారు. టెస్టుల్లో 537, వన్డేల్లో 156, T20లో 72 వికెట్లు తీశారు. అశ్విన్ 2010లో శ్రీలంకపై వన్డేల్లో, 2011లో వెస్టిండీస్ తో టెస్టుల్లో అరంగ్రేటం చేశారు. ఆడిలైడ్ లో అశ్విన్ తన చివరి టెస్టు మ్యాచ్ ఆడారు. టెస్టుల్లో 6 సెంచరీలు,14 హాఫ్ సెంచరీలతో 3503 పరుగులు చేశారు. ఆల్ రౌండర్ గా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతీసారి అశ్విన్ జట్టు కోసం వంద శాతం కష్టపడేవాడు.
 
అశ్విన్ అంకితభావం అలాంటిది
2021లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా... ఆస్ట్రేలియాతో భారత్ తలపడింది. ఆ మ్యాచులో అయిదురోజు టీమిండియా గెలవాలంటో 407 పరుగులు చేయాలి. అది చాలా కష్టం. డ్రా చేయాలన్నా టీమిండియాకు తలకు మించిన భారమే. అయితే టీమిండియా అద్భుతంగా పోరాడింది. ఆసీస్ జట్టు విజయానికి అడ్డుకట్ట వేసింది. ఈ మ్యాచ్ ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్న వేళ.. విపరీతమైన వెన్ను నొప్పిలోనూ అశ్విన్ అద్బుత పోరాటంతో భారత జట్టును ఓడిపోకుండా కాపాడాడు. అశ్విన్ విపరీతమైన నొప్పితో పడుకున్నాడని.. ఉదయం లేచి కనీసం నిటారుగా కూడా నిలపడలేకపోయాడని.. అలాంటిది ఆట అంత అద్భుతంగా ఎలా ఆడగలిగాడో తనకు అర్థం కాలేదని ఆశ్విన్ భార్య చెప్పడం.. అశ్విన్ కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో చెప్తుంది. కనీసం కిందకు వంగి షూ లేసులు కూడా కట్టుకోలేకపోయిన అశ్విన్ అ మ్యాచులో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ను డ్రా చేశాడు. ఇలాంటి ఎన్నో ఇన్నింగ్సులను అశ్విన్ ఆడాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతీసారి వంద శాతం ప్రదర్శన ఇచ్చాడు.  ఎన్నో రికార్డులను పాదాక్రాంతం చేశాడు. తాను ఎందుకు ప్రత్యేకమైన ఆటగాడినో ప్రతీసారి చాటి చెప్పాడు. ఒక మ్యాచులో విఫలమై తనపై తీవ్ర విమర్శలు వచ్చినా... తర్వాతి మ్యాచులో బంతితోనే దానికి సమాధానం చెప్పేవాడు. అందుకే అశ్విన్.. ఓ క్రికెట్ లెజెండ్.
 
 
ఈ రికార్డులు చెప్పవా..
అశ్విన్ తన కెరీర్ లో 268 మంది లెఫ్ట్ హ్యాండర్లను అవుట్ చేశాడు. లెఫ్టాండర్లు క్రీజులో ఉంటే అశ్విన్ ఇక ఆగడు. బంతిని గింగరాలు తిప్పుతూ.. వికెట్లను గిరాటేస్తూ పెవిలియన్ కు పంపుతాడు. 2011/12లో వెస్టిండీస్‌తో జరిగిన అరంగేట్ర సిరీస్‌లో 22 వికెట్లు తీయడం ద్వారా అశ్విన్ తన కెరీర్‌లో అద్భుతంగా ఆరంభించాడు. 2015 నుంచి 2021 సీజన్ మధ్య, అతను ఆసియాలో 20.88, ఇంగ్లాండ్‌లో 27.00, ఆస్ట్రేలియాలో 27.50, వెస్టిండీస్‌లో 23.17 సగటుతో వికెట్లను తీశాడు. ఆ సమయంలో మరే బౌలర్ ఈ సగటుతో వికెట్లను తీయలేదు. 2016/17 సుదీర్ఘ సీజన్‌లో అశ్విన్ స్వదేశంలో అద్భుత ఫామ్ తో చెలరేగిపోయాడు.
 
కేవలం నాలుగు సిరీసుల్లో 13 టెస్టు మ్యాచులు ఆడి 82 వికెట్లు సాధించాడు - టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ 13 టెస్టుల్లో 4430 డెలివరీలు వేశాడు. వీటిలో భారత్ 10 టెస్టుల్లో భారత్ గెలిచింది. అశ్విన్ టీమిండియాకు ఎంత కీలకమైన ఆటగాడో చెప్పేందుకు ఇంతకంటే ఎక్కువ గణాంకాలు అవసరం లేదు.  అశ్విన్ 537 టెస్ట్ వికెట్లలో 383 స్వదేశంలోనే వచ్చాయి.  మురళీధరన్ (493), జేమ్స్ ఆండర్సన్ (438), స్టువర్ట్ బోర్డ్ (398) తర్వాత  స్వదేశంలో ఎక్కువ వికెట్లు తీసిన నాలుగో బౌలర్ గా అశ్విన్ నిలిచాడు.

టాప్ హెడ్ లైన్స్

Usman Khawaja Scandal:  ఖవాజాపై నిప్పులు చెరిగిన మాజీ క్రికెట‌ర్, బాన్‌క్రాఫ్ట్ సంచలన ఆరోప‌ణ‌ల‌తో రంగంలోకి క్రికెట్ ఆస్ట్రేలియా
ఖవాజాపై నిప్పులు చెరిగిన మాజీ క్రికెట‌ర్, బాన్‌క్రాఫ్ట్ సంచలన ఆరోప‌ణ‌ల‌తో రంగంలోకి క్రికెట్ ఆస్ట్రేలియా
Rahul- Jaiswal Partnership:  కివీస్ గడ్డపై 36 ఏళ్ల పాత రికార్డును తిరగరాసిన జైస్వాల్ - రాహుల్.. తొలి టెస్టులో సెంచ‌రీ భాగస్వామ్యం, న్యూజిలాండ్ కు ఇండియా దీటైన జ‌వాబు
కివీస్ గడ్డపై 36 ఏళ్ల పాత రికార్డును తిరగరాసిన జైస్వాల్-రాహుల్ జంట.. తొలి టెస్టులో సెంచ‌రీ భాగస్వామ్యం, న్యూజిలాండ్ కు ఇండియా దీటైన జ‌వాబు
Yuzvendra Chahal Record: టీ20 ఫార్మాట్‌లో 400 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్‌గా చాహల్ రికార్డు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన
టీ20 ఫార్మాట్‌లో 400 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్‌గా చాహల్ రికార్డు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన
Jasprit Bumrah Milestone:  శ్రీనాథ్ ని వెనక్కి నెట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేక‌ర్ల‌లో టాప్ 10లోకి ఎంట్రీ..
శ్రీనాథ్ ని వెనక్కి నెట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేక‌ర్ల‌లో టాప్ 10లోకి ఎంట్రీ..

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
Embed widget