అన్వేషించండి

Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన

Ravichandran Ashwin Announces Retirement: గబ్బా టెస్టు తర్వాత అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నారు. ఇకపై క్రికెట్‌ ఆడే ఉద్దేశం లేదని చెప్పారు.

Ravichandran Ashwin Announces Retirement: టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ స్పిన్‌ మాంత్రికుడు కనిపించడు. గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ అనంతరం అశ్విన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇప్పటి వరకు అశ్విన్‌కు బలమైన రికార్డు ఉంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణించిన చరిత్ర అతనిడి. ఎన్నో ఓడిపోయిన మ్యాచ్‌లను గెలిపించాడు, డ్రాగా ముగించాడు.  టెస్టుతో పాటు వన్డే క్రికెట్‌లోనూ అశ్విన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు అనంతరం విలేకరుల సమావేశంలో రిటైర్మెంట్ ప్రకటించాడు.

స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే అశ్విన్‌కు మూడు ఫార్మాట్‌లో మంచి రికార్డు ఉంది. ఒక్క బౌలింగ్‌ మాత్రమే కాదు  బ్యాటింగ్‌తోనూ అద్భుతాలు చేశాడు. అశ్విన్  టెస్టుల్లో 537 వికెట్లు తీశాడు. 3503 పరుగులు కూడా చేశాడు. అలాంటి రికార్డు ఉన్న క్రికెటర్‌ నేడు రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు అనంతరం విలేకరుల సమావేశంలో రిటైర్మెంట్ ప్రకటించాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ డ్రా అయింది. ఈ టెస్టు మ్యాచ్ తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించాడు. అశ్విన్‌తోపాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. రిటైర్మెంట్‌కు సంబంధించి విలేకరుల సమావేశంలో అశ్విన్ మాట్లాడుతూ.. కాస్త ఎమోషనల్ అయ్యాడు. అంతర్జాతీయ స్థాయిలో భారత క్రికెటర్‌గా ఇదే నా చివరి రోజు అంటూ చెప్పారు. 

భారత్ తరఫున 106 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 3503 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 124 పరుగులు అతని అత్యుత్తమ టెస్టు స్కోరు. క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు ఎన్నోసార్లు మంచి ప్రదర్శన ఇచ్చి భారత్‌ను గట్టెక్కించాడు. 537 వికెట్లు తీశాడు. 59 పరుగులకు 7 వికెట్లు పడగొట్టడం అశ్విన్‌కు టెస్టుల్లో  అత్యుత్తమ ప్రదర్శన.

అశ్విన్ రిటైర్మెంట్‌పై టీమిండియా కెప్టెన్ ఏమన్నాడంటే...
సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ఇవ్వాలని అశ్విన్ నిర్ణయించుకున్నాడు. అతని నిర్ణయాన్ని మేమందరం గౌరవిస్తాం. అన్ని ఆలోచించుకున్నాక అశ్విన్ నిర్ణయం తీసుకున్నాడు. రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఈ సిరీస్ ప్రారంభంలోనే నాతో చెప్పాడు. పెర్త్ టెస్ట్‌కే అశ్విన్ విషయంలో నాకు క్లారిటీ ఉంది. అడిలైడ్ టెస్ట్ వరకు ఉండమని నేనే కన్విన్స్ చేశాను. గౌతమ్ గంభీర్‌తో కూడా అదే డిస్కస్ చేశాను. నా అవసరం లేకపోతే రిటైర్మెంట్ ఇచ్చేస్తానని మళ్లీ చెప్పాడు. బ్రిస్బేన్ టెస్ట్‌లో ఆడే అవకాశం లేకపోవడంతో తన డెసిషన్ తను తీసుకున్నాడు. నాలుగో టెస్ట్‌కి చాలా గ్యాప్ ఉంది. సో అశ్విన్‌ని రీప్లేస్ చేయడానికి మేం ఆలోచిస్తాం. అని టీమిండియా కెప్టెన్ రోహిత్ చెప్పారు. 

Image

ఇన్ని రోజులు టీమిండియాకు మీరు అందించిన సేవలకు కృతజ్ఞత అంటూ బీసీసీఐ ఓ ఎమోషనల్ పోస్టుపెట్టింది. ఓ మంచి ఆల్‌రౌండర్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడని ఎక్స్‌లో పోస్టు చేసింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Embed widget