అన్వేషించండి
Kashmir Snowfall Photos: భూతల స్వర్గాన్ని తలపిస్తున్న కాశ్మీర్, మంచుతో కళకళలాడుతున్న అందాలు
Snowfall In Kashmir | కాశ్మీర్ లోయ భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. మంచు దుప్పటి కప్పుకుని భూమి మీదకు స్వర్గం వచ్చిందా అన్నంత అందంగా గల్మార్గ్ , సోనమర్గ్, పహల్గామ్ ప్రాంతాలు కనిపిస్తున్నాయి.
భూతల స్వర్గాన్ని తలపిస్తున్న కాశ్మీర్, మంచుతో కళకళలాడుతున్న అందాలు చూశారా!
1/8

జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పలు ప్రాంతాల్లో మంచు (Snow) పరుచుకుంది. దీంతో ఈ పర్యటక ప్రదేశాలు మరింత అందంగా మారాయి. గుల్మార్గ్, సోనమర్గ్, పహల్గామ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు తాజాగా కురిసిన మంచు తో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు గుల్మార్గ్‌లో కురిసిన మంచు తో ఈ ప్రాంతం లో పర్యాటకులు సందడి చేస్తున్నారు.
2/8

కాశ్మీర్ పర్యాటక రంగానికి సరికొత్త జోష్: శీతాకాలం ప్రారంభంలోనే మంచు కురుస్తుండటంతో కశ్మీర్ పర్యాటక రంగం ఊపందుకుంది. గుల్మార్గ్ స్కీ రిసార్ట్‌లో రోజుకు సగటున 2,500 మంది పర్యాటకులు సందర్శిస్తున్నారని అధికారులు తెలిపారు. పహల్గామ్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 11.5 లక్షల మంది సందర్శకులను ఆకర్షించింది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు కశ్మీర్‌కు 2.6 మిలియన్ మంది పర్యాటకులు వచ్చారని గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 35 వేల మందికిపైగా విదేశీయులున్నారు. తాజా మంచు కురుస్తుండటంతో పర్యాటక రంగం మరింత పుంజుకునే అవకాశముందని కశ్మీర్ టూరిజం అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Published at : 27 Nov 2024 06:29 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















