Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Maruti Suzuki Ertiga Mileage మనదేశంలో బెస్ట్ మైలేజీని ఇచ్చే సెవెన్ సీటర్ కార్లలో మారుతి సుజుకి ఎర్టిగా కారు ముందంజలో ఉంటుంది. ఈ కారు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Best Mileage 7 Seater Car: మనం సెవెన్ సీటర్ కారుని కొనుగోలు చేసేటప్పుడు అధిక మైలేజీనిచ్చే కారును కొనుగోలు చేయాలని అనుకుంటాం. భారతదేశంలో అత్యధిక మైలేజీని ఇచ్చే సెవెన్ సీటర్ కారు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కారు పేరు మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga). ఇది దాని సెగ్మెంట్లో అత్యంత ఎక్కువ మైలేజీని ఇచ్చే కార్లలో ఒకటి. ఈ సెవెన్ సీటర్ కారు ముందు పెద్ద కార్లు కూడా చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇది మాత్రమే కాకుండా ఈ కారులో చాలా మంచి ఫీచర్లు కూడా ఉన్నాయి. మారుతి సుజుకి ఎర్టిగా ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 13 లక్షలుగా ఉంది.
మారుతి సుజుకి ఎర్టిగా ఎంత మైలేజ్ ఇస్తుంది?
మారుతి సుజుకి ఎర్టిగా మైలేజీ గురించి మాట్లాడితే దాని పెట్రోల్ వేరియంట్ లీటరుకు దాదాపు 20.3 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఎర్టిగా సీఎన్‌జీ వేరియంట్ 26.11 కిలోమీటర్ల మైలేజీని డెలివర్ చేస్తుంది. దీంతో పాటు ఎర్టిగా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
మారుతి సుజుకి ఎర్టిగా ఫీచర్లు ఇవే..
మారుతి సుజుకి ఎర్టిగా స్పెసిఫికేషన్ల గురించి చెప్పాలంటే... ఈ కారును మార్కెట్లో మంచి ఎంపీవీ అని చెప్పవచ్చు. ఈ ఏడు సీట్ల కారులో 1462 సీసీ పెట్రోల్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 101.64 బీహెచ్‌పీ పవర్‌ని, 136.8 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేయనుంది. అలాగే ఇందులో మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
దీంతో పాటు కారు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా ఏబీఎస్ విత్ ఈబీడీ, అల్లాయ్ వీల్స్, పవర్ విండోస్ వంటి ఇతర ఫీచర్లు కూడా కారులో ఉన్నాయి. మారుతి సుజుకి ఎర్టిగా కూడా సీఎన్‌జీ వేరియంట్లో అందుబాటులో ఉంది. అదే సమయంలో ఈ కారు మార్కెట్లో కియా క్యారెన్స్ వంటి ఎంపీవీలకు డైరెక్ట్‌గా పోటీని ఇస్తుంది.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
#Maruti #ERTIGA the best selling MPV in India scored 1 ⭐ star @GlobalNCAP upholding the brand heritage ✨
— Torque India (@TorqueIndia) July 31, 2024
Proud moment 👍
Best selling MPV with around 20K units per month sales, available in different names - MARUTI ERTIGA , XL6 , TOYOTA RUMION https://t.co/4eFvFgAsiE pic.twitter.com/tsiFzub03W
Top 10 selling cars in February 2024#Maruti Suzuki #WagonR - 19,412 units#TataPunch - 18,438 units#Maruti Suzuki #Baleno - 17,517 units
— Torque India (@TorqueIndia) March 4, 2024
Maruti Suzuki #Dzire - 15,837 units
Maruti Suzuki #Brezza - 15,765 units
Maruti Suzuki #Ertiga - 15,519 units#HyundaiCreta - 15,276… https://t.co/AQ5WKBohL7 pic.twitter.com/PC7OHRc5iG