Best Budget CNG Cars: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Best CNG Cars Under Rs 10 Lakhs: ప్రస్తుతం మనదేశంలో సీఎన్‌జీ కార్లు చాలానే ఉన్నాయి. వీటిలో బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
Best CNG Cars for Office: మీరు ఇంటి నుంచి ఆఫీస్‌కు లేదా ఇతర చోట్లకు ప్రయాణించడానికి బెస్ట్ సీఎన్‌జీ కారు కోసం చూస్తున్నట్లయితే మీకు మంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో సీఎన్‌జీ కార్ల అమ్మకాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. రోజూ ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లే వారు తమ కారులో రోజూ 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పెట్రోల్, డీజిల్ కార్ల కంటే సీఎన్‌జీ కార్లు చవకగా ఉంటాయి. ఇక్కడ అటువంటి అత్యుత్తమ సీఎన్‌జీ కార్ల గురించి చెప్పబోతున్నాం.
మారుతి సుజుకి ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10 CNG)
ఈ లిస్టులో మొదటి కారు మారుతి సుజుకి ఆల్టో కే10 సీఎన్‌జీ. ఆల్టో కే10 ప్రస్తుతం భారతదేశంలో అత్యంత చవకైన సీఎన్‌జీ కారు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.5.96 లక్షలుగా ఉంది. ఈ కారు భారీ ట్రాఫిక్‌ను సులభంగా దాటుతుంది. ఒక చిన్న కుటుంబానికి పర్ఫెక్ట్, ఈ కారులో 4 మంది సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.
మారుతి సుజుకి ఆల్టోలో ఏసీ, ఫ్రంట్ పవర్ విండో, పార్కింగ్ సెన్సార్, సెంట్రల్ కన్సోల్ ఆర్మ్‌రెస్ట్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, అడ్జస్టబుల్ హెడ్‌ల్యాంప్, హాలోజన్ హెడ్‌ల్యాంప్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్‌లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అనేక మంచి ఫీచర్లు ఉన్నాయి.
Also Read: ప్రతి నెలా లక్షల్లో అమ్ముడుపోతున్న బైక్‌లు - ఇండియాలో టాప్-5 కంపెనీలు ఇవే!
మారుతి సుజుకి విటారా బ్రెజా (Maruti Suzuki Vitara Brezza CNG)
మారుతి సుజుకి సెలెరియో సీఎన్‌జీ. మారుతి సుజుకి సెలెరియో... సీఎన్‌జీ కార్లలో అత్యంత ఎక్కువ మైలేజీని ఇచ్చే కారు. ఇది కేజీ ఇంధనానికి 34.43 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.6.69 లక్షలుగా ఉంది.
మోటార్‌సైకిల్‌ను నడపడానికి అయ్యే ఖర్చు కంటే ఈ కారును నడపడానికి అయ్యే ఖర్చు తక్కువ కాబట్టి ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ఈ కారులో ఐదుగురు సులభంగా కూర్చోవచ్చు. సెక్యూరిటీ కోసం ఈ కారులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన ఈబీడీ, ఎయిర్‌బ్యాగ్‌ల సౌకర్యాన్ని పొందుతారు.
టాటా టియాగో ఐసీఎన్‌జీ (Tata Tiago iCNG)
టాటా టియాగో ఐసీఎన్‌జీ కూడా ఈ లిస్ట్‌లో ఉంది. ఇది లీటర్ ఫ్యూయల్‌కు 27 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ కారులో ఐదుగురు ప్రయాణించవచ్చు. కారు ఇంజన్ గురించి చెప్పాలంటే, కారులో 1.2 లీటర్ ఇంజన్ ఉంది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో 73 హెచ్‌పీ పవర్, 95 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అందించారు.
ప్రస్తుతం మనదేశంలో సీఎన్‌జీ కార్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. దీంతో చాలా కంపెనీలు తమ ఫేమస్ కార్లలో సీఎన్‌జీ వెర్షన్లను తీసుకువస్తున్నాయి. సూపర్ హిట్ అయిన టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ల్లో కూడా సీఎన్‌జీ వేరియంట్లు మార్కెట్లో ఉన్నాయి.
Also Read: టీవీఎస్ ఐక్యూబ్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్ - సూపర్ ఆఫర్ ఇస్తున్న కంపెనీ!