TVS iQube Electric: టీవీఎస్ ఐక్యూబ్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్ - సూపర్ ఆఫర్ ఇస్తున్న కంపెనీ!
TVS iQube Electric Cashback: టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తున్నారు. ఈ ఆఫర్ డిసెంబర్ 22వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది.
TVS Scooter Cashback Offer: 2024 సంవత్సరం చివరికి వచ్చేసింది. మరికొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. 2025 సంవత్సరంలో అనేక బైక్‌లు, స్కూటర్లు, కార్ల ధరలు పెరగనున్నాయి. చాలా మంది ఆటోమేకర్లు కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. మారుతి నుంచి టయోటా, బీఎండబ్ల్యూ కార్లు, బైక్‌ల ధరలను పెంచడంపై అధికారిక ప్రకటనలు ఇచ్చాయి. అనేక ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు డిసెంబర్‌లో ప్రత్యేక ఆఫర్‌లతో ముందుకు వచ్చాయి. టీవీఎస్, ఓలా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై గొప్ప ఆఫర్లు అందిస్తున్నాయి.
టీవీఎస్ స్కూటర్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
టీవీఎస్ ఐక్యూబ్‌పై గొప్ప క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ టీవీఎస్ స్కూటర్ ఇప్పటి వరకు 4.50 లక్షల యూనిట్లు అమ్ముడయింది. ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా టీవీఎస్ ఐక్యూబ్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ డిసెంబర్ 12వ తేదీ నుంచి డిసెంబర్ 22వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది.
Also Read: ప్రతి నెలా లక్షల్లో అమ్ముడుపోతున్న బైక్‌లు - ఇండియాలో టాప్-5 కంపెనీలు ఇవే!
టీవీఎస్ అందిస్తున్న ఈ ఆఫర్‌లో, కస్టమర్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేయడం లేదా కొనుగోలు చేయడం ద్వారా ప్రతిరోజూ 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దీంతో పాటు రూ.30 వేల వరకు బెనిఫిట్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటీపై ఇస్తున్నారు. ఈ స్కూటర్‌పై ఐదు సంవత్సరాలు లేదా 70 వేల కిలోమీటర్ల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా ఉంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.89,999 నుంచి ప్రారంభం అవుతుంది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఫేమస్...
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు భారతీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు ప్రజలకు ఇష్టమైన మోడల్స్ లిస్ట్‌లో ఓలా ఎస్1 కూడా ఉంది. అక్టోబర్, నవంబర్ తర్వాత డిసెంబర్‌లో ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై గొప్ప ప్రయోజనాలను కూడా తీసుకొచ్చింది. ఈ ఈవీపై ఆరు వేల రూపాయల వరకు బెనిఫిట్స్ అందజేస్తున్నారు. దీంతో పాటు 16 వేల రూపాయల వరకు అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి ఓలా ఆఫర్‌లో తేడాను కూడా చూడవచ్చు. ఓలా ఎస్1 ధర రూ. 69,999 నుంచి ప్రారంభం కానుంది.
Also Read: మహీంద్రా థార్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.మూడు లక్షల వరకు తగ్గింపు!
The Carnival has begun! Hearty Congratulations to Mr. Usman Khan for receiving a 100% Cashback* at the TVS iQube Midnight Carnival. You could be next! Get your TVS iQube today. T&C apply. pic.twitter.com/YLoeBM1ipn
— TVS iQube (@tvsiqube) December 13, 2024
Unlock unbeatable offers at the TVS Midnight Carnival!
— TVS iQube (@tvsiqube) December 13, 2024
100% cashback every day and up to ₹30,000 in assured benefits. Get ready to ride and win!#TVSiQubeElectric #TVSiQube #TVSMotorCompany #SmartlySimple pic.twitter.com/Kkfc5fgVwg