One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Jamili election: జమిలి ఎన్నికల బిల్లుల అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీలో 21 మంది లోక్ సభ సభ్యులను ప్రకటించారు. దీనికి పీపీ చౌదరి చైర్మన్ గా వ్యవహరిస్తారు.
Lok Sabha Speaker appointed JPC on Jamili election: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు అయింది. లోక్‌సభ నుంచి 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులను నియమించింది. ఈ కమిటీకి పీపీ చౌదరి ఛైర్మన్‌గా నియమించారు. మొత్తం 31 మంది సభ్యులతో కమిటీ ఉటుంది. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్ తివారీ ఉన్నారు. అలాగే ధర్మేంద్ర యాదవ్, కళ్యాణ్ బెనర్జీ, సుప్రియా సూలే, శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే, సంబిత్ పాత్ర, అనిల్ బలూని, అనురాగ్ సింగ్ ఠాకూర్ సభ్యులుగా ఉన్నారు. నివేదికను తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో సమర్పించాలని కేంద్రం సూచించింది.
జమిలీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు
1. పీపీ. చౌదరి ( చైర్మన్ )
2. సీఎం రమేష్
3. బన్సూరి స్వరాజ్
4. పురుషోత్తం భాయ్ రూపాలా
5. అనురాగ్ సింగ్ ఠాకూర్
6. విష్ణు దయాళ్ రామ్
7. భర్తృహరి మహతాబ్
8. సంబిత్ పాత్ర
9. అనిల్ బలుని
10. విష్ణు దత్ శర్మ
11. ప్రియాంకాగాంధీ
12. మనీష్ తివారీ
13. సుఖ్దేవ్ భగత్
14. ధర్మేంద్ర యాదవ్
15. కల్యాణ్ బెనర్జీ
16. టీఎం సెల్వగణపతి
17. జీఎం హరీష్ బాలయోగి
18. సుప్రియా సూలే
19. శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే
20. చందన్ చౌహాన్
21. బాలశౌరి వల్లభనేని
మరో 10 మంది రాజ్యసభ సభ్యులు పేర్లు ప్రతిపాదించాల్సి ఉంది. ఆ తర్వాతే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.