CM Shivraj Chouhan: మధ్యప్రదేశ్ సీఎం మాస్ స్టెప్పులు- ఏం డ్యాన్స్ ఏసినవ్ కాకా!
CM Shivraj Chouhan: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది.
CM Shivraj Chouhan: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో గిరిజనుల వేషధారణతో సీఎం ఓ రేంజ్‌లో స్టెప్పులు వేశారు.
आदरणीय श्रीमती द्रौपदी मुर्मू जी को राष्ट्रपति पद की उम्मीदवार बनाने पर मा. प्रधानमंत्री श्री @narendramodi जी एवं राष्ट्रीय नेतृत्व के आभार कार्यक्रम से पूर्व जनजातीय भाई-बहनों के साथ उनके अद्वितीय लोक नृत्य एवं संगीत का साथी श्री @vdsharmabjp जी के साथ आनंद लिया। pic.twitter.com/aiN9yJELvk
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 23, 2022
ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికైనందుకు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సీఎం ఇలా డ్యాన్స్ చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్.. గిరిజనులు, భాజపా నేతలతో కలిసి నృత్యం చేశారు.
వైరల్
శివరాజ్ సింగ్ గిరిజనుల దుస్తులు ధరించి, చేతుల్లో నెమలి ఈకలు, విల్లు చేతబట్టి గిరిజన మహిళలతో కలిసి పాటకు డ్యాన్స్ చేశారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సీఎం చౌహాన్. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
నామినేషన్ దాఖలు
ద్రౌపదీ ముర్ము శుక్రవారం ఉదయం ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి ఆమె నామపత్రాలు సమర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, భాజపా, ఎన్డీయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మొదటగా ప్రధాని ఆమె పేరును ప్రతిపాదించారు. నామినేషన్ పత్రాలను 50 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరిచారు.
నామపత్రాల దాఖలుకు ఒకరోజు ముందుగా గురువారమే దిల్లీకి చేరుకున్నారు ముర్ము. గిరిజన నృత్యాలతో, సంప్రదాయ దుస్తులతో వచ్చిన అభిమానులతో అక్కడంతా కోలాహలం కనిపించింది.
Also Read: New York Gun Law: తుపాకీల వాడకంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు- అధ్యక్షుడు బైడెన్‌కు షాక్!
Also Read: Corona Cases: కరోనా ఫోర్త్ వేవ్ దగ్గర పడిందా? కొత్తగా 17 వేలకు పైగా కేసులు