Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Andhra News: గుంటూరు సాంఘిక సంక్షేమ వెల్ఫేర్ హాస్టల్‌లో ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డను ప్రసవించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు.

Pharmacy Student Delivery In Guntur Welfare Hostel: 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని హాస్టల్‌లో ఆడబిడ్డకు జన్మనివ్వడం తీవ్ర కలకలం రేపింది. గుంటూరు (Guntur) సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్‌లోనే తన తోటి విద్యార్థిని సహకారంతో ప్రసవించింది. ఈ క్రమంలో బాధిత విద్యార్థినికి తీవ్ర రక్తస్రావం కాగా హాస్టల్ సిబ్బంది, అధికారులు ఆమెను జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి (Naga Laxmi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి జయప్రదను సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణకు ఉన్నతాధికారులు ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
కాగా, సమీప బంధువైన ఓ యువకుడే విద్యార్థిని గర్భానికి కారణమని తెలుస్తోంది. బంధువుల సమక్షంలో త్వరలోనే వీరి వివాహం జరగనుందని సమాచారం. మరోవైపు, సదరు యువకునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థిని 9 నెలల పాటు గర్భంతో ఉన్నా సిబ్బంది కనిపెట్టలేదని.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

