అన్వేషించండి

Crime News: కుమార్తెను కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్! - హంతకులుగా మారిన పేరెంట్స్, రీల్ స్టోరీని తలదన్నే రియల్ స్టోరీ..

Hyderabad News: తమ కుమార్తెను కిడ్నాప్ చేశాడనే అనుమానంతో ఆ పేరెంట్స్ హంతకులుగా మారారు. ఏకంగా హనీట్రాప్ చేసి ఓ ఆటో డ్రైవర్‌ను హతమార్చారు. తాజాగా, ఈ కేసును పోలీసులు ఛేదించారు.

Hyderabad Police Solved Auto Driver Murder Case: ఏడాది క్రితం ఓ ఆటో డ్రైవర్ అదృశ్యం కాగా.. ఆ కేసును తాజాగా తెలంగాణ పోలీసులు ఛేదించారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించాడనే అనుమానంతో బాలిక తల్లిదండ్రులే హనీ ట్రాప్‌తో ఈ దారుణానికి పాల్పడ్డారని గుర్తించారు. నిందితులను బోరబండ పోలీసులు (Borabanda Police) అరెస్ట్ చేశారు. సినిమా స్టోరీని తలదన్నేలా ఆ రియల్ స్టోరీ భాగ్యనగరంలో జరిగింది. 2023 మార్చిలో ఆటోడ్రైవర్ అదృశ్యం కాగా.. బంధువులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు తాజాగా నిందితులను పట్టుకున్నారు.

ఇదీ జరిగింది..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని (Hyderabad) నిజాంపేట్‌కు చెందిన కుమార్ (30) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన ఓ కారు డ్రైవర్.. తన భార్య, కుమార్తెతో కలిసి జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నాడు. ఏడో తరగతి చదువుతున్న కారు డ్రైవర్ కుమార్తెను గతేడాది ఆటో డ్రైవర్ తీసుకెళ్లి యూసుఫ్‌గూడలోని ఓ గదిలో నిర్బంధించాడు. లైంగిక దాడికి యత్నించగా ఆమె తప్పించుకుని పారిపోయింది. చివరకు బాలానగర్ పోలీసులకు కనిపించగా.. ఆమెను విచారిస్తే అనాథనని చెప్పింది. దీంతో వారు ప్రత్యేక శిబిరానికి తరలించారు.

అటు, బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతకులాట ప్రారంభించారు. అయినా, ఫలితం లేకపోవడంతో కరోనా టైంలో ఆన్‌లైన్ తరగతుల కోసం కొనుగోలు చేసిన ఆమె లాప్‌టాప్‌ను పరిశీలించారు. స్నాప్‌చాట్‌లో ఓ ఫోన్ నెంబరును గుర్తించగా అది కుమార్‌దని తేలింది. దీంతో కుమారే తమ కుమార్తెను కిడ్నాప్ చేశాడని వారు అనుమానించారు.

హనీట్రాప్‌తో..

ఈ క్రమంలో బాలిక తల్లి స్నాప్‌చాట్‌లో ఓ ఐడి క్రియేట్ చేసి.. హనీట్రాప్‌తో ఆటో డ్రైవర్‌ను మియాపూర్ రప్పించింది. అక్కడకు వచ్చిన కుమార్‌పై దాడి చేసిన బాలిక పేరెంట్స్ అతన్ని కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తమ కుమార్తె ఆచూకీ చెప్పాలని నిలదీశారు. అయితే, బాలిక తన నుంచి తప్పించుకుపోయిందని చెప్పాడు. దీంతో అతన్ని తీవ్రంగా గాయపరచగా దెబ్బలకు తాళలేక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అనంతరం నిందితులిద్దరూ కారులో అతడిని సూర్యాపేట వైపు తీసుకెళ్లి పెద్ద బండరాయిని కాళ్లు, చేతులకు కట్టిపడేసి బతికుండగానే నాగార్జున సాగర్ ఎడమ కాల్వలోకి తోసేశారు. దీంతో కుమార్ మృతి చెందాడు.

బంధువుల ఫిర్యాదుతో..

ఈ క్రమంలో కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బోరబండ పీఎస్‌లో అదృశ్యం కేసు నమోదైంది. అనంతరం కారు డ్రైవర్ కుమార్తె తల్లిదండ్రుల వద్దకు చేరింది. అటు, కుమార్ ఆటోను కారు డ్రైవర్ వాడుతుండగా.. అతని బంధువులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు గుర్తు తెలియని మృతదేహం ఎముకలను డీఎన్ఏ పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. అసలు విషయం గుర్తించి బాలిక తల్లిదండ్రులనే నిందితులుగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget