అన్వేషించండి

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ

Sandhya Theatre Stampede Case | డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. సినిమా ప్రమోషన్ కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని స్పష్టం చేశారు.

Telangana DGP Jitender on Allu Arjun Case | కరీంనగర్: సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్‌లో చికిత్స పొండుతున్నాడు. అల్లు అర్జున్ సినిమా హీరో అయి ఉండొచ్చు, కానీ ఓ పౌరుడిగా బాధ్యతాయుతంగా ఉండాలని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. అల్లు అర్జున్‌కి మేం వ్యతిరేకం కాదు. కానీ ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే చట్టప్రకారం యాక్షన్ తీసుకుంటాం. థియేటర్ వద్ద ఆ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరం అన్నారు.

నటీనటులు పరిస్థితులు అర్థం చేసుకోవాలి

కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని డీజీపీ జితేందర్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ఎవరికీ వ్యతిరేకం కాదు. పౌరుల రక్షణ, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. అల్లు అర్జున్ సినిమా హీరో కావొచ్చు. బయట మాత్రం ఆయన ఓ సాధారణ పౌరుడు. ప్రతి పౌరుడు తమ వంతుగా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ఎంతైనా అవసరం. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అర్థం చేసుకుని మసలుకోవాలి. సినిమా ప్రమోషన్లు, ఈవెంట్ల కంటే మాకు ప్రజల భద్రతే ముఖ్యం. ప్రజల ప్రాణాల కంటే సినిమా ఈవెంట్లు ముఖ్యమైన విషయం కాదు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరిపై అయినా చర్యలు తప్పవు. అల్లు అర్జున్‌కు తాము వ్యతిరేకం కాదని’ స్పష్టం చేశారు.

సినిమా నటులైనప్పటికీ బయట వీరు సాధారణ పౌరుల్లా వ్యవహరించాలి. సినీ నటుడు మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన విషయం కుటుంబ సమస్య కానీ, జర్నలిస్టుపై దాడితో మోహన్ బాబుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పరిమితులకు లోబడి, పరిస్థితిని అర్థం చేసుకుని వ్యవహరిస్తే ఎవరికీ ఏ సమస్యా ఉండదు. లేనిపక్షంలో కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  - తెలంగాణ డీజీపీ  

మధ్యంతర బెయిల్ రావడంతో అల్లు అర్జున్ విడుదల

సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. కొన్ని రోజుల కిందటితో పోల్చితే బాలుడి పరిస్థితి కొంచెం మెరుగైందని హాస్పిటల్ శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. చిక్కడపల్లి పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి అల్లు అర్జున్ సహా కొందరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెండు వారాల రిమాండ్ విధించగా చంచల్ గూడ జైలుకు తరలించారు. హైకోర్టుకు వెళ్లడంతో నటుడికి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు.

ప్రైవేట్ బాడీ గార్డ్స్, బౌన్సర్లు హద్దుల్లో ఉండాలి..

బౌన్సర్లు, ప్రైవేట్ బాడీ గార్డ్స్ పేరుతో చట్టానికి వ్యతిరేకంగా ఎవరిపైనైనా దాడులు, బెదిరింపులు చేస్తే క్రిమినల్ కేసులతో జైలు ఊచలు లెక్కించాల్సి వస్తుందని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. బౌన్సర్లకైనా,ప్రైవేట్ బాడీ గార్డ్స్ కైనా పరిమితులు ఉంటాయని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు వెంటాడుతాయని స్పష్టం చేశారు.

Also Read: Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget