అన్వేషించండి

Brother Stabs Sister and Mother: చెల్లిని 84 సార్లు పొడిచి చంపిన అన్న - తల్లిపైనా దాడి- సోషల్ మీడియా వద్దన్నందుకే !

Engineer stabs twin sister: ఉద్యోగం మానేసి అదే పనిగా సోషల్ మీడియాలో టైంపాస్ చేస్తున్న యువకుడ్ని తల్లి, చెల్లి మందలించారు. ఇదే పాపం అయింది. వారిని చంపేయాలనుకున్నంత ఉన్మాదం తెచ్చుకున్నాడు.

Brother stabs sister 84 times: ఓ అన్న  తన చెల్లిని  పొడిచి చంపేశాడు. అలా ఇలా కాదు.. ఏకంగా84 సార్లు కత్తితో పొడిచి కసీదీరా చంపాడు.  పైగా తాను ఇలా చేశానని తల్లికి చెప్పడానికి ఆమెను ఆఫీస్ నుంచి నీకో సర్ ప్రైజ్ ఉంది పదా అంటూ ఇంటికి తీసుకెళ్లాడు. 
  
"నీకో సర్‌ప్రైజ్ ఉంది అమ్మ.. ఇంటికి పద" అంటూ ఒక కొడుకు పిలిచిన పిలుపు, ఆ తల్లికి జీవితాంతం మర్చిపోలేని మృత్యు గీతంగా మారుతుందని ఆమె ఊహించలేదు. గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న కవలలు హార్దిక్, హిమశిఖల మధ్య తలెత్తిన చిన్న వివాదం.. ఒక ఘోర కలికి దారితీసింది.

 అసూయ.. ఆవేశం.. 84 పోట్లు! 

హార్దిక్, హిమశిఖ ఇద్దరూ 25 ఏళ్ల కవలలు. సోదరి హిమశిఖ ఉద్యోగం చేస్తూనే ఎంబీఏ చదువుతుండగా, హార్దిక్ ఏడాదిన్నర క్రితమే తన ఉద్యోగాన్ని వదిలేసి సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పూణేకు చెందిన ఒక అమ్మాయితో ప్రేమలో పడి, ఆమెను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. ముందు కెరీర్ మీద దృష్టి పెట్టు.. ఆ తర్వాతే పెళ్లి  అని తల్లి, సోదరి వారించడం హార్దిక్‌లో కక్షను పెంచింది. మార్చి 6న ఇదే విషయంపై జరిగిన గొడవలో హార్దిక్ విచక్షణ కోల్పోయాడు. వంటగదిలోని కత్తి తీసుకుని తన సొంత సోదరిపై దాడి చేశాడు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారం.. హార్దిక్ తన సోదరిని ఏకంగా  84 సార్లు కత్తితో పొడిచి అత్యంత క్రూరంగా హతమార్చాడు.

 సర్‌ప్రైజ్ పేరుతో తల్లిపై మృత్యు దాడి 

సోదరిని చంపిన తర్వాత ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా హార్దిక్ తన తల్లి నీలిమ పని చేసే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్లాడు.  అమ్మ.. నీకో సర్‌ప్రైజ్ ఉంది, వెంటనే ఇంటికి పద  అని ఆమెను నమ్మించి తీసుకువచ్చాడు. ఇంటి తలుపు తీయగానే రక్తపు మడుగులో పడి ఉన్న కూతురిని చూసి ఆ తల్లి షాక్‌తో కేకలు వేసింది. ఆమె తేరుకునే లోపే హార్దిక్ ఆమెపై కూడా కత్తితో దాడి చేశాడు. ఆమె ఆర్తనాదాలు విన్న ఇరుగుపొరుగు వారు పరుగెత్తుకు రావడంతో, హార్దిక్  అక్కడి నుంచి పరారయ్యాడు. అదృష్టవశాత్తూ ఆ తల్లి ప్రాణాపాయం నుంచి బయటపడింది.

24 గంటల్లోనే  అరెస్టు

ఈ ఘోరకలి జరిగిన 24 గంటల్లోనే మొరాదాబాద్ పోలీసులు హార్దిక్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో అతను చెప్పిన సమాధానాలు విని పోలీసులు కూడా నిర్ఘాంతపోయారు.  కెరీర్ గురించి వారు చెప్పే సలహాలు నాలో అసహనాన్ని పెంచాయి.. అందుకే చంపేశాను అని అతను నిమ్మళంగా ఒప్పుకున్నాడు. సోషల్ మీడియా వ్యామోహం, కెరీర్ పట్ల బాధ్యతారాహిత్యం ఒక యువకుడిని ఎంతటి కిరాతకుడిగా మార్చాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.                                                             


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Mohali Woman Stabbed to Death: ప్రేమించలేదని ఆఫీసులోనే నరికేశాడు రాక్షసుడు - పంజాబ్‌లో ఘోరం
ప్రేమించలేదని ఆఫీసులోనే నరికేశాడు రాక్షసుడు - పంజాబ్‌లో ఘోరం
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
Embed widget