అన్వేషించండి

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

Telangana News: సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ఇలాంటివి సరికాదని.. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ, సీపీని ఆదేశించారు.

CM Revanth Reddy Tweet On Attack On Allu Arjun's House: హైదరాబాద్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులు చేయడం సరికాదని.. ఈ తరహా ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ, నగర సీపీని ఆదేశించినట్లు చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. అటు, సంధ్య థియేటర్ ఘటనతో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఇదీ జరిగింది

హైదరాబాద్ అల్లు అర్జున్ నివాసంపై ఆదివారం సాయంత్రం ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నేతలు దాడికి పాల్పడ్డారు. బన్నీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇంటి బయట బైఠాయించారు. కొందరు గోడలు ఎక్కి ఇంటిపైకి రాళ్లు రువ్వారు. కొందరు గోడ దూకి ఇంటి ఆవరణలోని పువ్వుల కుండీలను ధ్వంసం చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మృతికి అల్లు అర్జునే కారణమంటూ నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. జేఏసీ నేతలు 8 మందిని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించారు. కాగా, దాడి సమయంలో బన్నీ ఇంట్లో లేరు. ఈ క్రమంలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి బన్నీ నివాసానికి చేరుకుని ఘటన వివరాలను సెక్యూరిటీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బన్నీ పిల్లలను కారులో తన ఇంటికి తీసుకెళ్లారు.

'సంయమనం పాటిస్తున్నాం'

మరోవైపు, తన ఇంటిపై ఓయూ విద్యార్థుల జేఏసీ చేసిన దాడి ఘటనపై సినీ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) స్పందించారు. ఈ సమయంలో అందరూ సంయమనం పాటించాలని.. అదే అందరికీ మంచిదని అన్నారు. 'ఆదివారం సాయంత్రం మా ఇంటి బయట జరిగిందంతా చూశారు. ప్రస్తుతం మేం సంయమనం పాటింటాల్సిన సమయం. దేనికీ రియాక్ట్ కాకూడదు. ఇంటి ముందు ఆందోళన చేసిన వారిని పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. కేసు పెట్టారు. ఎవరైనా గొడవ చేయడానికి వస్తే అదుపులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించకూడదు. మీడియా వచ్చారు కదా అని.. ఈ ఘటనపై మేము స్పందించం. ఇలాంటి సమయంలో తొందరపడి ఎలాంటి చర్యలకు దిగొద్దు' అని విజ్ఞప్తి చేశారు.

Also Read: Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nani HIT 3 Telugu Trailer Reaction | జనాల మధ్యలో ఉంటే  అర్జున్..మృగాల మధ్యలో ఉంటే సర్కార్ | ABP DesamVirat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదేKarun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Shaik Rasheed : మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
New Toll System: టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Pawan Wife: పవన్ సతీమణి భక్తికి అంతా ఫిదా - అన్నా లెజ్‌నోవాకు అంతా  ఫ్యాన్స్ అయిపోయారుగా !
పవన్ సతీమణి భక్తికి అంతా ఫిదా - అన్నా లెజ్‌నోవాకు అంతా ఫ్యాన్స్ అయిపోయారుగా !
Embed widget