Anna Hazare On AAP Loss: హెచ్చరించినా పట్టించుకోలేదు- కేజ్రీవాల్ ఓటమికి కారణాలపై అన్నా హజారే ఘాటు వ్యాఖ్యలు
Delhi Election Results 2025 | ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితిపై సామాజిక కార్యకర్త అన్నా హజారే ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతి, లిక్కర్ స్కామ్ లపై కేజ్రీవాల్ ను హెచ్చరించినట్లు తెలిపారు.

#DelhiElectionResults | న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త అన్నా హజారే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఓటమిపై స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి మంచి క్యారెక్టర్ ఉండాలని, మంచి ఆలోచనపరులనే ప్రజలు ఎన్నుకుంటారంటూ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పటినుంచో ఎన్నికల విషయంపై కేజ్రీవాల్ ను హెచ్చరించినా, వాటిని పెడచెవిన పెట్టారని.. దాని ఫలితమే ఇదన్నారు అన్నా హజారే.
అన్నా హజారే మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేయడంపై పలుమార్లు హెచ్చరించాను. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థికి మంచి వ్యక్తిత్వంతో పాటు, మంచి ఆలోచనలు ఉండాలని నేను భావిస్తాను. వ్యక్తికి సంబంధించిన క్లీన్ ఇమేజ్ ఉండాలి. లేకపోతే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆప్ నేతలు అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని జైలుకు వెళ్లారు. ఇలాంటివి ఉండకూడదని చాలా కాలం నుంచి చెబుతున్నాను. ఆప్ నేతలు లిక్కర్ స్కామ్, అనివీతి ఆరోపణలలో చిక్కుకున్నారు. వాటి ఫలితంగా అతని (అరవింద్ కేజ్రీవాల్) ఇమేజ్ దెబ్బతింది. అందువల్లే ఆప్ నేతలకు, కేజ్రీవాల్‌కు ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి.
#WATCH | On #DelhiElectionResults, social activist Anna Hazare says, "I have been saying it for a long that while contesting the election - the candidate must have a character, good ideas and have no dent on image. But, they (AAP) didn't get that. They got tangled in liquor and… pic.twitter.com/n9StHlOlK9
— ANI (@ANI) February 8, 2025
కేజ్రీవాల్ వ్యక్తిత్వం కోల్పోయారు?
అరవింద్ కేజ్రీవాల్ తరచుగా వ్యక్తిత్వం గురించి మాట్లాడతాడు. కానీ అతడే మద్యం పాలసీ కేసులో ఇరుక్కున్నాడని ప్రజలు గమనించారు. దాంతో రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలు ఎన్నో ఆరోపణలు చేస్తాయి. అయితే తాను దోషిని కాదని కేజ్రీవాల్, ఆ పార్టీ నిరూపించుకోవాలి. నిజం ఎల్లప్పుడు ఒకటే ఉంటుంది. ఎప్పటికీ మారదు. కానీ తాము తప్పు చేయలేదని నిరూపించుకోవడంలో ఆప్ నేతలు సక్సెస్ కాలేదు. ఓ సమావేశం జరిగినప్పుడు, తాను పార్టీలో ఉండకూడదని డిసైడే బయటకు వచ్చేశా. ఆరోజు నుంచి ఆప్ కు దూరంగా ఉన్నానని’ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పష్టం చేశారు.
తన స్థానంలోనూ కేజ్రీవాల్‌కు కలిసిరాలేదు!
ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలుండగా, బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 25 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. వరుసగా నాలుగోసారి సీఎం కావాలన్న కేజ్రీవాల్ వ్యూహాలు ఫలించలేదు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా ఎన్నికల్లో ఆప్ ఓడటం మాత్రమే కాదు, న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో సైతం కేజ్రీవాల్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. 10 రౌండ్లు ముగిసిన తరువాత న్యూఢిల్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి పర్వేష్ కు 22034 ఓట్లు రాగా, కేజ్రీవాల్ కు 20190 ఓట్లు వచ్చాయి. కేజ్రీవాల్ మీద 1844 ఓట్ల ఆధిక్యంలో పర్వేష్ నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ 3503 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కానీ కేజ్రీవాల్ ను పరోక్షంగా దెబ్బకొట్టింది మాత్రం కాంగ్రెస్ నేత సందీప్.
Also Read: Delhi Election Results 2025 LIVE Updates: కేజ్రీవాల్‌కు ఊహించని షాక్- ఆప్ కంచుకోటలో బీజేపీ పాగా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

