Delhi Election Results 2025 LIVE Updates: ఆప్‌కు షాక్ ఢిల్లీని కైవసం చేసుకున్న బీజేపీ- MLA గా కూడా ఓడిన కేజ్రీవాల్- ఢిల్లీ నెక్స్ట్ సీఎం ఎవరు..?
Delhi Election Results LIVE Updates | ఢిల్లీలో ఎన్నికల ఫలితాలు తేలుతున్నాయి. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Background
Delhi Election Results 2025 LIVE Updates | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్ ముగియడంతో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. పోరాటం హోరాహోరీగా సాగినా భారతీయ జనతా పార్టీకే ఎడ్జ్ ఉందని ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. నేడు ఢిల్లీలో అదే సీన్ రిపీట్ అయింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 42 కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోండగా, ఆప్ 25 స్థానాలలో హవా కొనసాగిస్తోంది.
మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 32 -37
బీజేపీకి -35-40
కాంగ్రెస్ -0-1
చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 25 -28
బీజేపీకి -39-44
కాంగ్రెస్ -02-03
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 10-19
బీజేపీకి -51-60
కాంగ్రెస్ 00-00
పీ మార్గ్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 21 -31
బీజేపీకి -39-49
కాంగ్రెస్ -00-01
పోల్ డైరీ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 18 -25
బీజేపీకి -42 - 50
కాంగ్రెస్ -00-02
పోల్స్ ఇన్ సైట్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 25 -29
బీజేపీకి -40 - 44
కాంగ్రెస్ -00-01
వీ ప్రిసైడ్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 46-52
బీజేపీకి - 18-23
కాంగ్రెస్ -00-01
టైమ్స్ నౌ జేవీసీ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 22 - 31
బీజేపీకి -39-45
కాంగ్రెస్ -00-02
మైండ్ బ్రింక్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 44-49
బీజేపీకి -21-25
కాంగ్రెస్ -00-01
ఆబ్సల్యూట్ పొలిటికో అంచనా ఇదే
హైదరాబాద్ సంస్థ ఆబ్సల్యూట్ పొలిటికో కూడా బీజేపీదే విజయం అని తేల్చింది. ఈ ఎన్నికల్లో కాషాయం విజయం ఏకపక్షమేనని ప్రకటించింది. ఈ సంస్థ చేసిన సర్వే ప్రకారం బీజేపీకి 43 నుంచి 52 సీట్లు వస్తాయని పేర్కొంది. ఆమ్‌ఆద్మీ పార్టీకి 15-27 సీట్లే లభిస్తాయని అంచనాలు వేస్తోంది. కాంగ్రెస్‌కు అతికష్టమ్మీద రెండు సీట్ల వరకు వచ్చే అవకాాశం ఉందని తేల్చింది.
ఎగ్జిట్ పోల్స్‌లో చాలా వరకూ బీజేపీకే అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. రెండు ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఎనిమిదో కౌంటింగ్ జరగనుంది.
Delhi Elcetion Result: ఢిల్లీ ఎన్నికల ఫలితాల తాజా పరిస్థితి
ఢిల్లీ రాష్ట్ర పీఠాన్ని 27 ఏళ్ల తర్వాత బీజేపీ దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యత సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తాజా ఎన్నికల ఫలితాలు ఇక్కడ చూడండి:
Delhi Election Results: సమర్థవంతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం- కేజ్రీవాల్

ఢిల్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పారు. గడచిన పదేళ్లలో విద్య, వైద్య సౌకర్యాలు, మౌళిక సదుపాయాల కల్పనకు ఆప్ విశేషంగా కృషి చేసిందని చెప్పారు. బీజేపీకి అభినందనలు చెప్పిన ఆయన.. ప్రజలు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రతిపక్ష బాధ్యతను సమర్థంగా నిర్వహించడంతో పాటు.. నిత్యం ప్రజల్లోనే ఉంటామని చెప్పారు.





















