World Brain Day: నిద్రలేవగానే తలనొప్పిగా అనిపిస్తుందా? అందుకు కారణాలు ఇవి కావచ్చు
జులై 22 ప్రపంచ మెదడు దినోత్సవం. మనం చేసే పనుల వల్ల మెదడు మీద అధిక ఒత్తిడి పడి తలనొప్పి కలిగిస్తుంది. దీన్ని తగ్గించుకునేందుకు జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మంచిది.
బిజీ లైఫ్ షెడ్యూల్ కారణంగా చాలా మంది తమ ఆరోగ్యం మీద తక్కువగా దృష్టి పెడుతున్నారు. అందుకే ఈరోజుల్లో కాసేపు స్క్రీన్ చూసినా కూడా తలనొప్పి వచ్చేస్తుంది. చాలా మందికి ఇది రోజువారీ జీవితంలో ఒక సాధారణ భాగం అయ్యింది. ఒత్తిడి, నిశ్చల జీవనశైలి, నిద్రలేకపోవడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా తలనొప్పితో పాటు వికారంగా ఉంటే మాత్రం అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది శరీరంలోని అంతర్లీన సమస్యని సంకేతంగా భావించాలి.
పొద్దున్నే తలనొప్పిగా ఉంటుందా?
ఉదయం తలనొప్పి వస్తే నిద్రలేకపోవడం వల్ల అనుకుంటారు. కొద్ది సేపటికి అది తగ్గిపోతుంది. తెల్లవారు జామున తలనొప్పి రావడం వల్ల 4 గంటలకే నిద్ర మెలుకువ వచ్చేస్తుంది. స్లీప్ అప్నియా తో బాధపడే వ్యక్తులు సాధారణంగా నిద్రలో లేచిన తర్వాత తలనొప్పితో బాధపడతారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
తలనొప్పి రకాలు
⦿క్లస్టర్ తలనొప్పి
⦿మైగ్రేన్
⦿టెన్షన్ తలనొప్పి
ఉదయాన్నే తలనొప్పికి కారణమయ్య కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అవేంటంటే..
నిద్రలేమి: వైద్యుల ప్రకారం నిద్రలేమి ఉదయం తలనొప్పికి ప్రబలమైన కారణం. మైగ్రేన్ కూడా ప్రేరేపిస్తుంది. నిద్రలేమి వల్ల తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇది పగటి పూట పనితీరుని కూడా దెబ్బ తీస్తుంది. ఫలితంగా అలసట, పని మీద ఏకాగ్రత లేకపోవడం, నీరసం వంటివి అధికంగా ఎదురవుతాయి.
దీని సహాయంతో చికిత్స చేయవచ్చు
* మానసిక చికిత్స
* మందులు
వివిధ అధ్యయనాలు మానసిక రుగ్మతలు, మైగ్రేన్, నిరాశ, ఆందోళన వంటి అనేక మానసిక ఆరోగ్య పరిస్థితులు నిద్రలేమికి దారి తీస్తాయి. ఇవి ఉదయం తలనొప్పి ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. ఈ పరిస్థితులని టాక్ థెరపీ, మందులు, చికిత్స తో నయం చేయవచ్చని వైద్యులు తెలిపారు.
పళ్ళు కొరకడం
నిద్రలో కొంతమందికి పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది. దీని వల్ల నిద్రలేవగానే తలనొప్పిగా అనిపిస్తుంది. నిద్రలో పళ్ళు కొరుకుతున్నామనే విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ తలనొప్పితో మాత్రం నిద్రలేచి బాధపడతారు. ఇది టెంపోరోమాండిబ్యూలర్ రుగ్మతకు దోహదపడుతుంది. బ్రక్సిజమ అని కూడా పిలుస్తారు. దీని వల్ల దంతాలకు హాని కలుగుతుంది. అధిక ఒత్తిడి, నిద్రలేమి ఈ వ్యాధి లక్షణాలు. ఒత్తిడిని తగ్గించడం లేదా మౌత్ గార్డ్ ఉపయోగించడం వల్ల బ్రక్సిజమ సంబంధిత తలనొప్పిని నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
మెడ మీద ఒత్తిడి
చాలా సార్లు మనం ఎలా పడితే అలా పడుకుంటాం. దాని వల్ల కండరాలు పట్టేస్తాయి. దిండు, నిద్రించే స్థానం వాలల మెడలో కండరాలు బిగపట్టేస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం దిండు వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. సరైన దిండు ఉపయోగించడం వల్ల నిద్రలో వచ్చే ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. రెండు వైపులా ఎత్తుగా ఉండే ప్రత్యేకమైన డిజైన్ ఉన్న దిండ్లు ఉపయోగించుకోవచ్చు.
మద్యం
విపరీతంగా మద్యం సేవించే వాళ్లయితే మీకు తరచుగా తెల్లవారుజామున తలనొప్పి వస్తుంది. అధికంగా మద్యపానం వల్ల హ్యాంగోవర్ వస్తుంది. నిద్ర చెడిపోతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: బైపొలార్ డిజార్డర్ బాధితులు అకాల మరణానికి గురవ్వుతారా? కారణాలేమిటీ?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial