Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్
నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ లో ఓ ఫన్నీ ఘటన జరిగింది. అదేంటంటే ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్యాంటు జేబులను వెతికాడు. అంతకు ముందు దీపక్ చాహర్ బౌలింగ్ లో వరుసగా మూడు బంతుల్లో మూడు ఫోర్లు కొట్టి ఊపుమీదున్న అభిషేక్ శర్మ దగ్గరకు వెళ్లిన సూర్య ఇలా తనను ప్యాంట్ జేబులు చూపించమని లోపల ఏమన్నా ఉందేమోనని చూశాడు. దీనికి రీజన్ మీకు గుర్తుండే ఉంటుంది. సన్ రైజర్స్ ముంబైతో ఆడకముందు పంజాబ్ కింగ్స్ మీద సంచలన ఇన్నింగ్స్ ఆడింది. పంజాబ్ 245పరుగుల టార్గెట్ ఇస్తే..అభిషేక్ శర్మ 55 బాల్స్ లోనే 141 పరుగులు కొట్టి పంజాబ్ పెట్టిన భారీ టార్గెట్ ను ఛేజ్ చేసి పారేశాడు. సెంచరీ పూర్తి చేసిన తర్వాత తన జేబులో నుంచి ఓ చీటీ తీసి ఫ్యాన్స్ కు చూపించాడు. దాని మీద దిజ్ వన్ ఫర్ ది ఆరెంజ్ ఆర్మీ అని రాశాడు. చీటీ రాసుకొచ్చి మరీ అభిషేక్ శర్మ సృష్టించిన విధ్వంసం టాక్ ఆఫ్ ది ఐపీఎల్ గా మారింది. సో ముంబై మీద కూడా ఏమన్నా అలా చీటీ రాసుకొచ్చాడా..అందుకే అవుట్ అవ్వట్లేదా అన్న డౌట్ తో సూర్య కుమార్ అలా అభిషేక్ శర్మ పాకెట్స్ వెతికాడు. ఓ రకంగా భయపడ్డాడు సూర్య ఏదైనా మళ్లీ ప్రళయంలా విరుచుకు పడతాడేమోనని. అయితే దురదృష్టవశాత్తూ ఆ ఓవర్లోనే పాండ్యా బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుటైపోయాడు అభిషేక్ శర్మ. 28 బంతుల్లో 7 ఫోర్లతో 40 పరుగులు చేసిన అభిషేక్ మరోసారి ఆరెంజ్ ఆర్మీకి అండగా నిలుస్తాడనుకుంటే..సూర్యా పాకెట్స్ వెతికిన కాసేపటకే అవుటై పోయాడన్న మాట.





















