Anurag Kashyap: బ్రాహ్మణులపై మూత్రం పోస్తా -కలకలం రేపుతున్న బాలీవుడ్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
Anurag Dirictor: తన సినిమా విషయంలో సీబీఎఫ్‌సీ నుంచి అడ్డంకులు వస్తూండటంతో దర్శకుడు అనురాగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇన్‌స్టాలో ఓ వ్యక్తికి రిప్లై ఇస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

Anurag Kashyap explosive remark: బాలీవుడ్ చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ బ్రాహ్మణ వర్గాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విమర్శలు ఎదుర్కొంటున్నారు. నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్న అనురాగ్ ఇటీవల సామాజిక సంస్కర్తలు జ్యోతిరావు, సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్రతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆయనకు సమస్యలు ఏర్పడ్డాయి. సెన్సార్ కావడంలేదు. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) , బ్రాహ్మణ సమాజంలోని ఒక వర్గంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "బ్రాహ్మణులపై నేను మూత్రం పోస్తానని" వ్యాఖ్యానించాడు. 
ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వివాదానికి దారితీశాయి. కొందరు ఇది అనురాగ్‌లోని బ్రాహ్మణ వ్యతిరేక ధోరణిని చూపిస్తుందని, బాధ్యతారహితంగా సమాజాన్ని రెచ్చగొట్టెలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు అతని చిత్రంలో బ్రాహ్మణులను అవమానించే అంశాలు ఉన్నాయని ధృవీకరిస్తున్నాయని అంటున్నారు. అందుకే సీబీఎఫ్‌సీ సెన్సార్ చేయడం లేదని.. భావిస్తున్నారు.
I request @MumbaiPolice to file an FIR against Anurag Kashyap and arrest him. Mentally unstable individuals like him are a threat to society and should not be ignored.
— Tajinder Bagga (@TajinderBagga) April 18, 2025
CC Sh @Dev_Fadnavis Ji pic.twitter.com/z6aOJFOF6L
అనురాక్ కశ్యప్ వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలు, హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అతని వ్యాఖ్యలు కుల విద్వేషాన్ని రెచ్చగొడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణ సమాజంలో ఆగ్రహాన్ని, ఏకీకరణ రావాలని కొందరు పిలుపునిస్తున్నారు.
Anurag Kashyap is a Rajput. Was a great filmmaker once. Now he lost his touch. Trying some third rated roles in South Indian films. Now wanted to gain publicity in North - so he started abusing Brahmins and also starting war of Brahmins vs Rajputs unnecessarily. pic.twitter.com/fo0oVLxMaQ
— Rohith (@rohithverse) April 18, 2025
అనురాగ్ కశ్యప్ గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సామాజిక-రాజకీయ అంశాలపై నేరుగా వ్యక్తం చేసే అభిప్రాయాలు పలుమార్లు వివాదాస్పదమయ్యాయి.
I have relocated cities.i have not left filmmaking . For all the people who think I am frustrated and gone . I am here and I am busier than shah rukh khan ( I have to be, I don’t make
— Anurag Kashyap (@anuragkashyap72) April 17, 2025
As much money😂) I don’t have dates until 2028. I have five directorial hopefully coming out…
అనురాగ్ కశ్యప్ తీరుపై బాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఫూలే మూవీ బయటకు వస్తుందా లేదా అన్నది కూడా ఇంకా స్పష్టత రాలేదు. కానీ రిలీజ్ డేట్ ప్రకటించారు.





















