అన్వేషించండి

Vincy Aloshious: 'వాళ్లు నమ్మక ద్రోహం చేశారు' - 'దసరా' విలన్‌పై ఫిర్యాదు వెనక్కు తీసుకున్న నటి విన్సీ అలోషియస్

Shine Tom Chacko: డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటుడిపై సంచలన ఆరోపణలు చేసిన నటి విన్సీ అలోషియస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైందన్నారు.

Vincy Aloshious Withdraws Complaint Against Shine Tom Chacko: ఓ మూవీ సెట్‌లో నటుడు డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఇటీవలే సంచలన ఆరోపణలు చేశారు ప్రముఖ మలయాళ నటి విన్సీ అలోషియస్ (Vincy Aloshious). తాజాగా.. కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో పాటు 'అమ్మ' అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, నటుడి పేరు ఎక్కడా బయట పెట్టకపోయినా ఫిర్యాదు తర్వాత నటుడు 'షైన్ టామ్ చాకో'పైనే (Shine Tom Chacko) ఆమె ఫిర్యాదు చేశారనే విషయం బయటకు వచ్చింది.

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లైంది

త్వరలో విడుదల కానున్న 'సూత్రవాక్యం' సినిమా సెట్‌లో షూటింగ్ సమయంలో నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి విన్సీ అలోషియస్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను ఫిర్యాదు చేసేటప్పుడే అతని పేరు ఎక్కడా బయటకు రాకూడదని అధికారులకు చెప్పానని.. వారు బహిర్గతం చేసినట్లు తెలిపారు. తన కంప్లైంట్ వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Also Read: నెలలోపే ఓటీటీలోకి విక్రమ్ కొత్త మూవీ 'వీర ధీర శూరన్' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

'పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లైంది'

'నేను కంప్లైంట్ చేసినప్పుడే ఆ నటుడి పేరు, ఇతర వివరాలు ఎక్కడా బయటకు రాకుండా చూడాలని సంబంధిత అధికారులకు చాలా స్పష్టంగా చెప్పాను. కానీ వాళ్లు ఇప్పుడు నాకు నమ్మక ద్రోహం చేశారు. ఓ నటుడు చేసిన తప్పు వల్ల మొత్తం చిత్ర బృందంపై ఎఫెక్ట్ పడుతుంది. ఇలా జరగడం కరెక్ట్ కాదు. అలా అనే నేను ఆ నటుడి పేరును ఎక్కడా ఇంటర్వ్యూల్లో చెప్పలేదు. నాకు ఎదురైన చేదు అనుభవాల గురించి తెలుసుకున్న సినీ రంగానికి చెందిన పలు సంస్థల నుంచి ఎంతో మద్దతు లభించింది. ఆ నటుడు ఎంతో ప్రతిభావంతుడు. అతనికి సినిమాల్లో అవకాశాలు ఇవ్వడంలో తప్పు లేదు. నేను కోరుకునేది ఒక్కటే. చేసిన తప్పులను సరిదిద్దుకునే ఛాన్స్ అతనికి ఇద్దాం. ఈ సంఘటనతో నాకు అధికారులపై నమ్మకం కోల్పోయాను. నేను కంప్లైంట్ వెనక్కు తీసుకుంటున్నా.' అని పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే?

నటి విన్సీ అలోషియస్.. ఇటీవల ఓ సినిమా సెట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ వీడియో ద్వారా వివరించారు. మూవీ సెట్‌లో డ్రగ్స్ తీసుకుని నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సంచలన ఆరోపణలు చేశారు. షూటింగ్ జరిగినన్ని రోజులు తనతో అనుచితంగా ప్రవర్తించాడని.. తన ముందే దుస్తులు మార్చుకోవాలని ఇబ్బంది పెట్టాడని తెలిపారు. 'దీని తర్వాత డ్రగ్స్ అలవాటు ఉన్న నటులతో ఇకపై పని చేయకూడదని నిర్ణయించుకున్నా. దీని వల్ల భవిష్యత్తులో నాకు ఎక్కువ అవకాశాలు రాకపోవచ్చు. కానీ ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నా.' అని పేర్కొన్నారు. దీనిపై కేరళ ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌తో పాటు 'అమ్మ' అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుండగా.. తాజాగా నటుడి పేరు బహిర్గతం చేశారంటూ ఆమె ఫిర్యాదు వెనక్కు తీసుకున్నట్లు తెలిపారు.

సినిమాల విషయానికొస్తే.. విన్సీ అలోషియస్ 2019లో 'వికృతి' అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. 'రేఖ' మూవీలో ఆమె నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. అలాగే 'జన గణ మన', 'సౌదీ వెల్లక్క', 'పద్మిని', 'పజంజన్ ప్రణయం' వంటి మలయాళ హిట్ సినిమాల్లో నటించారు. చివరిగా 'మారివిల్లిన్ గోపురంగల్' చిత్రంలో మీనాక్షిగా తెరపై మెరిశారు.

షైన్ టామ్ చాకో.. 'దసరా' సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించారు. ఆ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత రంగబలి, దేవర, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget