Klassen's glove error Rickelton Not out | IPL 2025 MI vs SRH మ్యాచ్ లో అరుదైన రీతిలో రికెల్టన్ నాట్ అవుట్
నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ నస్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో ఓ అరుదైన ఘటన జరిగింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ఆఖరి బంతికి సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ జీషన్ అన్సారీ వేసిన బాల్ ను సరిగ్గా అంచనా వేయలేకపోయిన ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ బాల్ ని గాల్లోకి కొట్టేశాడు. దీంతో లాంగాన్ లో ఉన్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పరిగెత్తుకుంటూ బాల్ ను క్యాచ్ పట్టుకున్నాడు. చేసేదేం లేక ర్యాన్ రికెల్టెన్ నీరసంగా గ్రౌండ్ వదలి బయటకు వెళ్లాడు. అయితే ఈ లోగా ఫోర్త్ అంపైర్ ర్యాన్ రికెల్టెన్ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లి రికెల్టన్ ను ఆపాడు. ఓ చిన్న చెకింగ్ చేయాలని అప్పటి వరకూ వెయిట్ చేయమని కోరాడు. ఈ లోగా థర్డ్ అంపైర్ మళ్లీ ఫీడ్ ను చెక్ చేస్తే తేలింది ఏంటంటే బాల్ ను బ్యాటర్ రికెల్టన్ కొట్టడానికి ముందే వికెట్ల వెనుక ఉన్న కీపర్ క్లాసెన్ వేసుకున్న గ్లోవ్స్ సంప్ వికెట్స్ దాటి కొద్ది గా ముందుకు వచ్చాయి. దీంతో రికెల్టన్ ను నాటాట్ గా ప్రకటించి మళ్లీ క్రీజ్ లోకి పంపించటం తో పాటు ఆ బాల్ ను నోబాల్ గా కన్సిడర్ చేసి ఫ్రీ హిట్ ఇచ్చారు. చాలా మంది ఏముంది Mi అంటే నే అంత..స్క్రిప్టు స్క్రిప్టు అంటూ ట్విట్టర్ లో హడావిడి చేశారు కానీ క్రికెట్ రూల్ బుక్స్ లో దీని గురించి ప్రత్యేకమైన నిబంధన ఉంది. బాల్ ను బౌలర్ డెలివరీ చేసిన తర్వాత బ్యాటర్ దాన్ని కొట్టేంత కీపర్ వికెట్లను దాటించి రాకూడదు ఆఖరికి తన గ్లోవ్స్ కూడా స్టంప్స్ ను దాటకూడదు. ఇక్కడ క్లాసెన్ అలా చేయటంలో ఫెయిల్ అయ్యాడు. అతనికి గ్లోవ్స్ ను స్టంప్స్ ముందుకు రావటంతో రికెల్టన్ కాస్తా లైఫ్ సంపాదించి మళ్లీ క్రీజులోకి వచ్చాడన్న మాట. అదీ సంగతి.



















