Skoda Car: ఈ SUVకి ఇంత డిమాండ్ ఏంటి బాసూ?, ఏకంగా 5 నెలల వెయిటింగ్ పిరియడ్
Skoda Kylaq SUV: స్కోడా లాంచ్ చేసిన ఈ SUV మార్చి 2025లో బంపర్ సేల్స్ సాధించింది. పెరుగుతున్న డిమాండ్ కారణంగా వేచి ఉండే కాలం 5 నెలలకు చేరుకుంది.

Skoda Kylaq SUV Waiting Period, Price And Features: భారతీయ ప్రజలకు స్కోడా కొత్త SUV కైలాక్ చాలా బాగా నచ్చింది. 2025 మార్చిలో, గరిష్టంగా 5,327 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది ఇప్పటి వరకు స్కోడా బెస్ట్ సెల్లింగ్ కారుగా మారింది. స్కోడా కైలాక్ SUV డెలివరీ 2025 జనవరి నుంచి ప్రారంభమైంది. బడ్జెట్ రేటు, ఆకట్టుకునే ఫీచర్ల కారణంగా అనతి కాలంలో ప్రజల మన్ననలు అందుకుంది. అధిక డిమాండ్ కారణంగా ఈ SUV వెయిటింగ్ పిరియడ్ 2 నెలల నుంచి 5 నెలలకు పెరిగింది. అంటే మీరు ఈ కార్‌ను బుక్ చేసిన తర్వాత దానిని పొందడానికి కనిష్టంగా 2 నెలలు - గరిష్టంగా 5 నెలలు ఎదురు చూడాలి.
కస్టమర్ల నుంచి మంచి స్పందన రావడంతో, ఏప్రిల్ చివరి వరకు, స్కోడా కైలాక్ ప్రారంభ ధరను రూ.7.89 లక్షలు చేసినట్లు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ జెనెబా వెల్లడించారు. స్కోడా కైలాక్ క్లాసిక్ ట్రిమ్ వెయిటింగ్ పిరియడ్ 5 నెలలు కాగా, ఈ మోడల్ మాన్యువల్ గేర్ బాక్స్‌లో మాత్రమే వస్తుంది. సిగ్నేచర్, సిగ్నేచర్+ ట్రిమ్ కోసం వెయిటింగ్ పిరియడ్ దాదాపు 3 నెలలు & ప్రెస్టీజ్ ట్రిమ్ వెయిటింగ్ పిరియడ్ 2 నెలలు.
స్కోడా కైలాక్ క్లాసిక్ ఫీచర్లు
స్కోడా కైలాక్ క్లాసిక్ ట్రిమ్ 16-అంగుళాల స్టీల్ వీల్స్‌తో గాలితో పందెం వేసినట్లు పరుగులు పెడుతుంది. దీనికి 6 ఎయిర్‌బ్యాగులు & సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉన్నాయి. మిర్రర్‌లో మాన్యువల్ డే అండ్ నైట్ మోడ్ ఉంది. పిల్లల భద్రత కోసం ISOFIX యాంకర్ అందించారు. ప్రయాణీకులందరి కోసం మూడు పాయింట్ల సీట్ బెల్టులు & సర్దుబాటు చేసుకోగల హెడ్‌రెస్ట్‌లు బిగించారు. ట్రాక్షన్ కంట్రోల్ & ఆటో ఇంజిన్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌ను అందించారు. పవర్ విండోస్, మాన్యువల్ AC & రియర్ AC వెంట్స్ ఫెసిలిటీలు ఉన్నాయి. డిజిటల్ MIDతో పాటు అనలాగ్ డయల్ కూడా ఉంది. దీనికి ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ & 12V ఛార్జింగ్, టిల్ట్ స్టీరింగ్ అడ్జస్ట్ & పవర్డ్ వింగ్ మిర్రర్లు కూడా అరేంజ్ చేశారు. సీట్లను ఫాబ్రిక్‌తో తయారు చేశారు, సంగీతాన్ని ఆస్వాదించడానికి 4 స్పీకర్ ఆడియో సిస్టమ్ కూడా ఉంది.
సిగ్నేచర్ ట్రిమ్ ఫీచర్లు
సిగ్నేచర్ ట్రిమ్‌లో క్లాసిక్ ట్రిమ్‌లో ఉన్న అన్ని ఫీచర్లు ఉన్నయి, ఇది 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో నడుస్తుంది. టైర్ ప్రెజర్ మానిటర్ & రియర్ డీఫాగర్ ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యానెల్‌లు & సీట్ ఫాబ్రిక్‌పై డ్యూయల్-టోన్ ఫినిషింగ్ చూడవచ్చు. 5-అంగుళాల టచ్ స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ఫ్రంట్ USB టైప్-C స్లాట్ కూడా ఉన్నాయి.
సిగ్నేచర్+ ట్రిమ్ ఫీచర్లు
సిగ్నేచర్+ ట్రిమ్‌లో 6-స్పీడ్ మాన్యువల్ & ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. దీనిలో సిగ్నేచర్ అన్ని ఫీచర్లను యాడ్ చేశారు. ఇది రియర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, 10-అంగుళాల టచ్ స్క్రీన్, ఆటోమేటిక్ AC & డిజిటల్ డయల్స్ ఈ బండిని ఎట్రాక్టివ్‌గా మార్చాయి. పవర్ ఫోల్డింగ్ వింగ్ మిర్రర్స్, లెదర్-వ్రాప్డ్ స్టీరింగ్, క్రూయిజ్ కంట్రోల్, డ్యాష్‌బోర్డ్ ఇన్సర్ట్స్ & ప్యాడిల్ షిఫ్టర్స్‌తో ఈ వేరియంట్‌ను డిజైన్ చేశారు.
ప్రెస్టీజ్ ట్రిమ్ ఫీచర్లు
సిగ్నేచర్+ లోని అన్ని ఫీచర్లతో పాటు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను దీనికి అందించారు. రియర్ వైపర్, ఆటో డిమ్మింగ్ IRVM, పవర్డ్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, లెదర్ అప్‌హోల్ట్సరీ & పవర్డ్ ఫ్రంట్ సీట్లు దీని అదనపు ఆకర్షణలు. ఈ SUV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.89 లక్షలు. ఇది.. మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO & కియా సోనెట్ వంటి ప్రముఖ మోడళ్లతో పోటీ పడుతుంది.
2025 చివరి నాటికి నెలకు 8,000 యూనిట్లను విక్రయించాలని స్కోడా భావిస్తోంది. ఇది వాస్తవ రూపం దాలిస్తే, 2026 నాటికి భారతదేశంలో ఏటా 1 లక్ష వాహనాలు అమ్మాలన్న లక్ష్యాన్ని కంపెనీ సాధించగలదు.





















