Allu Arjun - Sreeleela: శ్రీ లీలతో పాటు అల్లు అర్జున్ మీద కేసు పెట్టాలి - డిమాండ్ చేస్తున్న స్టూడెంట్ ఫెడరేషన్, ఎందుకంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యంగ్ హీరోయిన్ శ్రీలీల మీద కేసు నమోదు చేయాలని విజయవాడకు చెందిన స్టూడెంట్ ఫెడరేషన్ ఒకటి డిమాండ్ చేస్తోంది. ఎందుకో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబును విచారణకు రావాల్సిందిగా ఈడి నోటీసులు జారీ చేసింది. ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు ఆయన కుటుంబం యాడ్ చేయడం అందుకు కారణం. కొన్ని రోజులు వెనక్కి వెళితే... బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కొంతమంది సెలబ్రిటీల మీద కేసులు నమోదు చేశారు. ఆ జాబితాలో అల్లు అర్జున్, శ్రీ లీల మీద కూడా కేసు నమోదు చేయాలని విజయవాడకు చెందిన ఒక స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది.
బన్నీ, శ్రీ లీల మీద ఎందుకు కేసు పెట్టాలి?
కార్పొరేట్ విద్యా సంస్థలకు శ్రీ లీలతో పాటు అల్లు అర్జున్ కూడా యాడ్ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలలో మంచి మార్కులు రావాలంటే శ్రీ చైతన్య కాలేజీల్లో చేరాలని శ్రీ లీల యాడ్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా హాళ్లలో కూడా ఆ యాడ్ ప్లే చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా మూడేళ్ల క్రితం అటువంటి యాడ్ ఒకటి చేశారు. అందుకనే వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది.
Also Read: బాలకృష్ణ బర్త్ డేకి టీజర్... నెల రోజులు ఫారిన్ షెడ్యూల్... 'అఖండ 2' లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
AISF Vijayawada demands criminal cases against Allu Arjun & Sreeleela.#AlluArjun #SreeLeela pic.twitter.com/cDICaoHzxy
— Milagro Movies (@MilagroMovies) April 21, 2025
రానా దగ్గుబాటి నుంచి లక్ష్మీ మంచు ప్రకాష్ రాజ్ వరకు పలువురు సెలబ్రిటీల మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఏ విధమైన కేసు నమోదు చేశారో... అటువంటి కేసులు అల్లు అర్జున్ శ్రీ లీల మీద నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ పట్ల ప్రభుత్వ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Also Read: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత





















