(Source: Poll of Polls)
Heart Attack: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?
గుండెపోటు, కార్డియాక్ అరెస్టు... ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా దాడి చేసి ప్రాణాలు హరిస్తున్న మహమ్మారులు.
గుండెపోటు, కార్డియాక్ అరెస్టు వంటి ఆరోగ్య అత్యవసరస్థితులు అనుకోకుండా దాడి చేస్తాయి. మనిషిని అపస్మారక స్థితిలోకి తీసుకెళ్తాయి. అలాంటప్పుడు రోగికి ప్రాథమిక చికిత్స అవసరం పడుతుంది. లేకుంటే కొన్ని నిమిషాల్లోనే మరణం సంభవించడం ఖాయం. అలాంటి ప్రాథమిక చికిత్సలో ప్రధానమైనది కార్డియో పల్మోనరీ రిససిటేషన్ (CPR).ఆగిపోయిన గుండెను మళ్లీ బతికించే ప్రయత్నం చేయడమే సీపీఆర్. ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఇంకా వివరంగా చెప్పాలంటే గుండె పనిచేయడం ఆగిపోవడం వల్ల శరీరభాగాలకు రక్త సరఫరా నిలిచిపోతుంది, ఆ రక్త సరఫరాను తిరిగి పంపణీ అయ్యేలా చేయడమే సీపీఆర్.
సీపీఆర్ ఎప్పుడు చేయాలి?
గుండె పోటు వచ్చిన వ్యక్తి శ్వాస తీసుకుంటున్నాడో లేదో వెంటనే గమనించాలి. ఛాతీ పై చెవి పెట్టి వింటే గుండె శబ్ధం వినిపిస్తుంది. అలా వినిపించకపోయినా, ముక్కు నుంచి శ్వాస తీసుకోకపోయినా వెంటనే సీపీఆర్ మొదలుపెట్టచ్చు. ఈలోపు ఎవరినైనా అంబులెన్సుకు ఫోన్ చేయమని చెప్పాలి. సీపీఆర్ చేయడం వల్ల ఎలాంటి కీడు జరుగదు కాబట్టి భయపడకుండా ఆపదలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ చేయమని చెబుతున్నారు వైద్యులు.
ఎలా చేయాలి?
1. గుండెపోటు లేదా కార్డియక్ అరెస్టుకు గురైన వ్యక్తిని నేలపై వెల్లకిలా పడుకోబెట్టాలి.
2. రెండు చేతులతో ఛాతీ మధ్యలో బలంగా అదమాలి. అలా 30 సార్లు వరుసగా అదమాలి. మధ్యలో రెండు నోటితో నోటిలోకి శ్వాసను ఇవ్వాలి. ఇలా ఆ వ్యక్తికి స్పృహ వచ్చేవరకు చేయాలి.
3. పిల్లలకు మాత్రం ఛాతీ మధ్యలో ఒక చేతితోనే అదమాలి. ఇక శిశువుల విషయానికి కేవలం ఛాతీ మధ్యలో రెండు వేళ్లతో మాత్రమే అదమాలి.
సీపీఆర్ చేయడం వల్ల ప్రపంచంలో చాలా మంది ప్రాణాలు నిలిచాయి. సీపీఆర్ ఆగిపోయిన శరీరభాగాలకు తిరిగి రక్తం పంపిణీ అయ్యేలా చూస్తుంది. మెదడుకు కూడా రక్త సరఫరా జరిగేలా చూస్తుంది. ఈలోపు ఆసుపత్రికి చేరుకుంటే ప్రాణాపాయం తప్పుతుంది.
అలా అని ప్రతిసారి సీపీఆర్ ప్రాణం పోయదు. గుండె పోటు తీవ్ర స్థాయిలో వచ్చినా, కార్డియాక్ అరెస్టు కూడా ఊహించనంత తీవ్రంగా దాడి చేసినా... ప్రాణం కాపాడుకోవడం కష్టమవుతుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు
Also read: తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?
Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?