Mobile Insurance :మొబైల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకుంటే చాలా నష్టపోతారు!
Mobile Insurance :మొబైల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే, ఆపిల్ కేర్ లేదా సామ్‌సంగ్ కేర్ ప్లాన్ లాంటి బ్రాండెడ్ ప్లాన్స్ తీసుకోండి.
భారీ ధర పెట్టి ఫోన్ కొంటున్న వాళ్లు చాలా మంది మొబైల్ ఇన్సురెన్స్ చేస్తున్నారు. ఇది అవసరం కూడా. అయితే ఈ మొబైల్ కోసం ఇన్సురెన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇన్సురెన్స్ తీసుకునేటప్పుడు అనుసరించాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు ఇక్కడ మీకు వివరంగా చెబుతాం. మొబైల్ బీమా కోసం ఎంత ఖర్చు పెట్టాలి. మీ డబ్బు ఎంత ఆదా అవుతుంది. అలా బీమా చేస్తే మీ ఫోన్ ఎలా సురక్షితంగా ఉంటుందో ముందుగా తెలుసుకుందాం.
మొబైల్ బీమా ప్రయోజనం ఎంత?
మీరు ఒక స్టోర్ నుంచి లేదా ఈ-కామర్స్ వెబ్‌సైట్ నుంచి కొత్త ఫోన్ కొనుగోలు చేసినప్పుడల్లా ఆ షాపు యజమాని కానీ, ఆన్‌లైన్‌లో విక్రేతలు కానీ బీమా గురించి మీకు చెబుతుంటాం. ఈ మొబైల్ బీమా గురించి చాలాసార్లు వినే ఉంటారు. కానీ మీరు తిరస్కరించే ఉంటారు. వాస్తవానికి మీరు వేలు పెట్టి కొనే మొబైల్‌కు మరో వెయ్యి రెండు వేలు పెట్టి ఇన్సురెన్స్ చేస్తే తప్పులేదని చాలా మందికి తెలియకపోవచ్చు.
కొత్తగా మీరు ఏ కంపెనీ ఫోన్ తీసుకున్నా సరే ఏడాది పాటు ఎలాంటి రిపేర్ కానీ ఇతర సమస్యలు కానీ రావు. తర్వాత నుంచి సమస్యలు మొదలవుతాయి. అందుకే మీరు కొనే మొబైల్‌కు తగ్గట్టుగానే బీమా చేయించుకోవాల్సి ఉంటుంది. చాలా మంది 30 వేలు, నలభై వేలకు కొనే ఫోన్‌కు వెయ్యికి మించి బీమా తీసుకోవడానికి ఇష్టపడరు. ఏడాది వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత సమస్యలు వస్తే కంపెనీ కూడా మీ ఇబ్బందిని పట్టించుకోదు. ఇలాంటి ఫిర్యాదులు చాలా మంది చేస్తున్నారు.
మీరు మొబైల్ బీమా తీసుకోవాలనుకుంటే బ్రాండెడ్ బీమా తీసుకోండి. ఉదాహరణకు ఆపిల్ కేర్ లేదా ఆపిల్‌తో వచ్చే శామ్‌సంగ్ కేర్ ప్లాన్ లాంటి నుంచి మీరు బీమా తీసుకుంటే పూర్తి బాధ్యత కంపెనీ చూసుకుటుంది. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్‌లను ఆయా మొబైల్ కంపెనీలు పట్టించుకోకపోవచ్చు.
బ్రాండెడ్ బీమా కాస్త ఖరీదైనవిగానే ఉంటాయి. వాటి ధర 7,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. మీ ఫోన్ కాస్ట్ ఆధారంగా ఈ బీమా ఉంటుంది. అలాంటి ప్లాన్ తర్వాత కూడా మీరు బీమా క్లెయిమ్ చేసుకుంటే, ఫోన్ రిపేర్ చేయడానికి లేదా మార్పిడి చేసుకోవడానికి 2-3 వేలు ఖర్చు చేయాల్సి రావచ్చు. సర్వీస్ ఛార్జ్, ట్యాక్స్ రూపంలో ఆయా సంస్థలు తీసుకుంటాయి.
మొబైల్ ఇన్సురెన్స్ తీసుకుంటే యూజ్ ఏంటీ?
మీ మొబైల్ చోరి అయినా ఎక్కడైననా పోగొట్టుకున్నా మీరు ఇన్సురెన్స్ క్లైమ్ చేయవచ్చు. లేకుంటే మీ జేబు నుంచే ఆ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
పొరపాటును ఫోన్ కిందపడినా, నీటిలో పడినా ఇంకా వేరే విధంగా డ్యామేజ్ అయినా ఆ ఖర్చులను ఇన్సురెన్స్ కంపెనీ భరిస్తుంది. మీరు తీసుకునే ఇన్సురెన్స్ పై ఆ ఖర్చు ఆధారపడి ఉంటుంది.
యాభై వేలకు మించిన ఖరీదు కలిగిన మొబైల్స్‌కు ఇన్సురెన్స్ బాగా యూజ్ అవుతుంది. వాటి రిపేర్, రీప్లేస్‌మెంట్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పెద్ద బ్రాండ్ కంపెనీలకు మాత్రమే ఇన్సురెన్స్ యూజ్‌ఫుల్ అవుతుంది.
కొన్ని ఇన్సురెన్స్ కంపెనీలు ఓటీటీ ప్లాన్‌లతో కలిపి ఇస్తున్నాయి. వాటి కోసం ఆన్‌లైన్‌లో వెతికి బ్రాండెడ్ తీసుకోవడం మంచిది.





















