Good Friday: జీసస్‌ను సిలువ వేసినప్పుడు తగిలించిన 'INRI ' అనే బోర్డు అర్థం ఏమిటి? అది అసలు ఏ భాష?
Good Friday: జీసస్ ను సిలువ వేసినప్పుడు తగిలించిన 'INRI ' అనే బోర్డు అర్థం ఏమిటి? అది అసలు ఏ భాష? ఇప్పుడు ఆ బోర్డు ఇప్పుడు ఎక్కడ ఉంది?

Good Friday: నేడు గుడ్ ఫ్రైడే.. ఏసుక్రీస్తును సిలువ వేసిన రోజు. తమ నమ్మకానికి వ్యతిరేకంగా దేవుని కుమారుడిగా చెప్పుకుంటూ దైవ ద్రోహానికి పాల్పడ్డాడు అనేది యూదుల ఆరోపణ. వారి నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి రోమన్ గవర్నర్ "పొంటియస్ పైలైట్ (పొంతి పీలాతు )" జీసస్ క్రైస్ట్‌ను సిలువ వేయించింది ఈరోజే అని క్రైస్తవుల నమ్మకం. మానవులు చేస్తున్న పాపాలన్నీ తన రక్తాన్ని ప్రాణాన్ని అర్పించడం ద్వారా దేవుడు క్షమించేలా జీసస్ చేశాడు అనేది ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్లు నమ్ముతారు. అందుకే దీనిని 'గుడ్ ఫ్రైడే' గా వారు చెబుతారు.
ఏసుక్రీస్తును శిలువ వేసినప్పుడు ఆయన తలపై 'INRI ' అనే బోర్డును తగిలించినట్టు బైబిల్లో ఉంది. ఇంతకు ఆ పదం అర్థం ఏంటి.. అది ఏ భాష అనేది ఇప్పుడు చూద్దాం.
INRI - "యేసు యూదుల రాజు "
జీసస్ తనను తాను యూదుల రాజుగా చెప్పుకుంటున్నాడు అనేది ఆయనపై ఉన్న ప్రధానమైన ఆరోపణ. యూదులు రోమన్ గవర్నర్‌తో తమను అవమానించడమే అని తమకు రోమన్ చక్రవర్తి మాత్రమే రాజు అని గవర్నర్‌తో చెప్పారు. ఇప్పటికీ టైబీరియస్ (42BCE -37CE) రోమన్ చక్రవర్తిగా ఉన్నాడు." దైవ కుమారుడు" అంటూ యూదుల విశ్వాసాన్ని.."యూదుల రాజు" అంటూ రోమన్ల రాజ ద్రోహానికి పాల్పడ్డాడు అంటూ జీసస్‌పై రెండు వైపుల నుంచి రెండు రకాల ఆరోపణలు చేశారు యూదుల మత పెద్దలు అని బైబిల్‌లో ఉంది. దీనితో చేసేది లేక రోమన్ గవర్నర్ "పైలైట్ " జీసస్‌కు సిలువపై మరణ శిక్షను విధించాడు. రోమన్ సైనికులు జీసస్‌ను 'గోల్గతా ' కొండపైకి తీసుకెళ్లి సిలువ వేసినట్టు గాస్పల్స్ (సువార్తలు) చెబుతున్నాయి. ఆ సమయంలో జీసస్ వేలాడుతున్న సిలువపైనే 'INRI' అనే బోర్డును వేలాడదీసినట్టు జీసస్ జీవిత చరిత్రను పేర్కొన్న నాలుగు గాస్పెల్స్‌లోనూ రాసి ఉంది. బైబిల్‌లోని మాత్యు 27:37, మార్క్ 15:26,లూక్ 23:38,జాన్ 19:19 గ్రంధాల్లో ఈ అంశాన్ని పేర్కొన్నారు . ఇంతకూ ' INRI' అర్ధం " Iesus Nazarenus Rex Iudaeorum," ( జీసస్ ఆఫ్ నజరేత్, కింగ్ ఆఫ్ ది జ్యూస్ ) అని. లాటిన్ లో రాసిన ఈ సెంటెన్స్‌లోని పదాల తొలి అక్షరాలను కలిపి INRI అని జీసస్ శిలువపై వేలాడదీశారు. నిజానికి ఇది ఆయన్ని అవమానిస్తూ వేలాడదీసిన బోర్డు. కానీ తరువాతి కాలంలో క్రిస్టియానిటీ బలపడిన తర్వాత అది జీసస్‌కు సింబల్‌గా మారిపోయింది. చాలా పెయింటింగ్స్‌లోను ఫోటోలలోనూ సిలువపై INRI బోర్డు తగిలించి ఉన్నట్టుగా జీసస్‌ను సింబాలిజంగా చూపుతారు.
ఆ బోర్డు ఏమైంది.. ఇప్పుడెక్కడ ఉంది
జీసస్‌ను సిలువ వేసిన 200 సంవత్సరాల తరువాత రోమన్ చక్రవర్తి కాన్ స్టంటైన్ (272-337CE) క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాడు. రోమన్ సామ్రాజ్య అధికారిక మతంగా క్రైస్తవాన్ని ప్రకటించారు. ఒక్కసారిగా క్రిస్టియానిటీకి హోదా పెరిగిపోయింది. చక్రవర్తి తల్లి పెయింట్ హెలినా జెరూసలేం కీ యాత్ర చేసి క్రిస్టియానిటీకి సంబంధించిన అనేక వస్తువుల్ని సేకరించి భద్రపరిచి వచ్చారు. అలాంటి వాటిలో ఈ" INRI "బోర్డు కూడా ఉందని..దానిని ఆమె రోమ్‌కు తీసుకొని వచ్చి 325ADలో " హోలీ క్రాస్ ఇన్ జెరుసలెం " అనే చర్చి కట్టి అందులో భద్రపరిచారని చెబుతారు. 1124ADలో 'డల్ ఓర్సొ' అనే మత గురువు ఆ చర్చిని మళ్ళీ నిర్మించి ఒక బాక్స్‌లో పెట్టి 1144లో తాను "లూసియస్ 2" పోప్ అయ్యాక ఆ బాక్స్‌పై తన సీల్ వేసి చర్చిలోనే దాచేశారు.1492ADలో ఆ చర్చ్‌ను మళ్లీ నిర్మిస్తుండగా "పెడ్రో మెండోజా " అనే స్పానిష్ మత గురువుకు ఆ బాక్స్ దొరికింది. ఇప్పటికీ చెక్కతో తయారుచేసిన ఆ బోర్డు రోమ్‌లోని ఆ చర్చిలోనే ఉంది. ఆ గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ INRI బోర్డును క్రిస్టియానిటీకి సంబంధించిన ఒక పవిత్రమైన వస్తువుగా భావిస్తుంటారు. మరి కొంతమంది మాత్రం ఆ బోర్డు మధ్యయుగాలకు సంబంధించిన ఒక ఫోర్జరీ వస్తువుగా చెబుతుంటారు. నిజాలు ఏంటనేది వారి వారి విశ్వాసాలను బట్టి ఆధారపడి ఉంటుంది.





















