Vanajeevi Ramaiah: గొప్ప ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయాం, ఆయన ఎందరికో ఆదర్శం - వనజీవి రామయ్య మృతిపై రేవంత్, చంద్రబాబు సంతాపం
వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

పద్మశ్రీ వనజీవి రామయ్య గారి మరణం
— Revanth Reddy (@revanth_anumula) April 12, 2025
తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.
కోటి మొక్కలు నాటి వనజీవినే…
తన ఇంటిపేరుగా మార్చుకున్న
గొప్ప పర్యావరణ హితుడు రామయ్య.
ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ…
కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/7AoLhdrwEM
వనజీవి రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటు అని, తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని వనజీవి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. వృక్షో రక్షతి రక్షితః " అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, కోటికి పైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనదన్నారు. మొక్కల పెంపకం కోసం వనజీవిగా మారిన దర్పల్లి రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు.
ప్రపంచ పర్యావరణ కోసం సాగిన మానవ కృషిలో వనజీవి గా వారు చేసిన త్యాగం అసమాన్యమైనదని అన్నారు. అడవులు, పచ్చదనం అభివృద్ధి దిశగా నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేసిన.. తెలంగాణ కు హరిత హారం... ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దర్పల్లి రామయ్య అందించిన సహకారం గొప్పదని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తు తరాలకు మనం అందించే సంపద హరిత సంపదే కావాలని, భౌతిక ఆస్తులు కావనీ కేసీఆర్ పునరుద్ఘాటించారు.
🔹 వనజీవి రామయ్య గారి మరణం పచ్చదనానికి తీరని లోటు
— BRS Party (@BRSparty) April 12, 2025
🔹 తెలంగాణ, ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయింది
- మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం… pic.twitter.com/1A4zLRHKKD
పచ్చని అడవులను ధ్వంసం చేస్తూ, వన్యప్రాణులకు నిలువనీడ లేకుండా ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న పర్యావరణ వ్యతిరేక ధోరణులను నిలువరించడానికి, వర్తమాన పరిస్థితుల్లో వేలాది వనజీవి రామయ్యల అవసరం ఉన్నదని కేసీఆర్ స్పష్టం చేశారు. వనజీవి మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. రామయ్య కుటుంబ సభ్యులకు, అభిమానులకు పర్యావరణ పరిరక్షకులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.























