Amaravati Airport: అమరావతి రైతుల సమస్యలు తీర్చలేక తంటాలు -భారీ ఎయిర్‌పోర్టుకు ప్లాన్లు - ప్రభుత్వం తొందరపడుతోందా?
Amaravati: అమరావతిలో అతిపెద్ద ఎయిర్ పోర్టుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందు కోసం భూసమీకరణ చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఆకాశానికి నిచ్చెనలు వేస్తోందా?

Amaravati largest airport : అమరావతిలో రెండో విడత భూసమీకరణకు సన్నాహాలు చేస్తున్నామని సహకరించాలని తమ సమస్యలను పరిష్కరించాలని కోరతూ వచ్చిన రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రైతుల సమస్యలే పరిష్కారం కావడం లేదు. కానీ రెండో విడత భూసమీకరణ గురించి చంద్రబాబు వారికి చెప్పారు. నిజానికి ఈ ప్రక్రియ గతంలోనే ప్రారంభమయింది. కానీ రైతుల వ్యతిరేకతతో ఆపేశారు. రెండో విడతలో సమీకరించాలనుకుంటున్న భూముల్లో ఎయిర్ పోర్టు కట్టాలనుకుంటున్నారు.
అమరావతికి భారీ ఎయిర్ పోర్టు ప్రణాళిక
అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదన 2025లో మొదలైంది. 4,618 ఎకరాల్లో 4,000 మీటర్ల రన్‌వే, మెట్రో కనెక్టివిటీ, కార్గో SEZతో బోయింగ్ 777 వంటి పెద్ద విమానాలకు అనుకూలంగా రూపొందించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. గన్నవరంలో రన్ వేను విస్తరిస్తున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. సమీపంలోనే ఎయిర్ పోర్టు ఎందుకు అన్నప్రశ్న సహజంగానే అందరికీ వస్తోంది. అమరావతి రాజధానిగా డెవలప్ అయితే, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దానికి కీలకం. IT, ఫార్మా, మాన్యుఫాక్చరింగ్ వంటి ఇండస్ట్రీలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. టూరిజం, బిజినెస్ ట్రావెలర్స్ పెరిగి, రెవెన్యూ 5-10 సంవత్సరాల్లో రికవర్ అవుతుందని చెబుతున్నారు.
గ్లోబల్ కనెక్టివిటీ ఆలోచనలు
రాజధాని అంటే గ్లోబల్ కనెక్టివిటీ అవసరం. బెంగళూరు, హైదరాబాద్ వంటి సిటీల్లో డెడికేటెడ్ ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. అమరావతి ఎయిర్‌పోర్ట్ ఉండాలని అందుకే భావిస్తున్నారు. క్లై రైల్వే ఇంజినీరింగ్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ త్వరలో వస్తుంది, ఇది ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ లోన్‌లతో ఫైనాన్స్ సులభమని చెబుతున్నారు. ప్రాజెక్ట్ ఖర్చు 15,000-20,000 కోట్లు ఉంటుంది. ఏపీ బడ్జెట్‌లో ఇది భారీ భారం. విజయవాడ ఎయిర్‌పోర్ట్ 30 కి.మీ. దూరంలోనే ఇప్పటికే ఉంది విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేవు, అమరావతికి అవసరమా అని నెటిజన్లు కొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో 4 ఎయిర్‌పోర్టులు లాసెస్‌లో ఉన్నాయి.
ఎయిర్ పోర్టులు నగరాలకు 50 కి.మీ దూరంలోనే
5,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదనతో రైతులు భూములు కోల్పోతారు. అమరావతి ఎయిర్‌పోర్ట్ ఏపీ రాజధాని అభివృద్ధికి అవసరం ఎకానమీ, కనెక్టివిటీ పెంచుతుంది. కానీ, ఖర్చు, పర్యావరణం, రైతుల హక్కులు పరిగణనలోకి తీసుకుంటే తొందరపాటు అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. విజయవాడ ఎయిర్‌పోర్ట్ అప్‌గ్రేడ్‌తో పారలల్‌గా ప్లాన్ చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అంతర్జాతీయ ఎయిర్ పోర్టులు నగరాలకు 50 కిలోమీటర్ల దూరంలో కడుతున్నారు. బోగాపురం విశాఖకు యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది. ముంబైలో రెండో ఎయిర్ పోర్టు కనీసం 70 కిలోమీటర్ల దూరంలో కట్టారు. అందుకే .. అమరావతికి విజయవాడ ఎయిర్ పోర్టు సరిపోతుందని .. కావాలంటే ఆ ఎయిర్ పోర్టునే మరింతగా విస్తరించాలని సూచిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అమరావతిలోనే భారీ ఎయిర్ పోర్టు ఉండాలని పట్టుదలగా ఉంది.





















