Anantapur Crime News: రామగిరి డిప్యూటీ తహసీల్దార్ భార్య ఆత్మహత్య! గొంతు కోయడంతో కుమారుడు సైతం
అనంతపురం జిల్లా రామగిరి డిప్యూటీ తహశీల్దార్ రవి భార్య ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందే కుమారుడిని గొంతుకోసి చంపినట్లు పోలీసులు గుర్తించారు.

Anantapur Crime News | అనంతపురంలోని శారద నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా రామగిరి డిప్యూటీ తాహసీల్దార్ భార్య, ఆమె కుమారుడ్ని చంపి, తాను ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కుటుంబ కలహాలు ప్రపంచం తెలియని చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. భార్యాభర్తల మధ్య వివాదాలతో తల్లిదండ్రులే పిల్లలను చంపుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
మూడున్నర ఏళ్ల చిన్నారి సహర్షను తల్లి అమూల్య గొంతు కోసి దారుణంగా హత్య చేసింది. కుమారుడిని హత్య చేసిన తరువాత ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ సంఘటనపై అనంతపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్నూలు జిల్లాకు చెందిన అమూల్య, తాడిమర్రి ప్రాంతానికి చెందిన రవికి ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. రవి ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని రామగిరి మండలం డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. వీరికి సహర్ష అనే మూడున్నర సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. కొంతకాలం కిందట నుంచి వీరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న సాయంత్రం డ్యూటీ ముగించుకొని ఇంటికీ తిరిగొచ్చిన భర్త రవి డోర్ ఎంతసేపు కొట్టినా తలుపు తెరవలేదు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసుల సాయంతో డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడటంతో అమూల్య చీరకు వేలాడుతూ కనిపించింది. మూడున్నరేళ్ల బాలుడు అప్పటికే హత్యకు గురయ్యాడని గుర్తించారు. అమూల్య తన కుమారుడిని చంపి, ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు అనుమానం వ్యక్తంచేశారు. హత్య చేశారేమోనని సైతం స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. అనంతపురం టౌన్ డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. లో ఆధారాలు సేకరించారు. మృతురాలు అమూల్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.























