Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 6 టెస్ట్ సిరీస్‌లు జరిగాయి. వీటిలో భారత్ మూడు సిరీస్‌లలో ఓడిపోయింది, కేవలం 2 గెలిచింది. ఒక సిరీస్ డ్రాగా ముగిసింది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా భారత్‌ను సొంతగడ్డపైనే క్లీన్ స్వీప్ చేశాయి. ప్రపంచంలోనే నంబర్-1 టెస్ట్ టీమ్ గా ఉన్న భారత్ .. ఇప్పుడు ఇలా చెత్త ప్రదర్శన చేయడానికి గల కారణాలు ఏంటని ఫ్యాన్స్ తోపాటు విశ్లేషకులు కూడా అంచనా వేయడం మొదలు పెట్టారు.
గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎనిమిది, తొమ్మిది నంబర్ వరకు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ బౌలింగ్ బలహీనంగా మారింది. గతంలో జట్టులో 6 మంది స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌లు, 5 స్పెషలిస్ట్ బౌలర్లు, ఒక ఆల్ రౌండర్ తో టీమ్ ఉండేది. IPLలో బాగా రాణించిన చాలా మంది ప్లేయర్స్ ను టీమ్ లోకి తీసుకుంటున్నారు. హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఇందుకు ఉదహరణ. ప్రతి టెస్ట్ సిరీస్‌లో .. కొత్త ఆర్డర్, కొత్త బ్యాట్స్‌మెన్‌లు. భారత టెస్ట్ జట్టులో ఇదే జరుగుతోంది. ఆలా మార్పులు చేయడం వల్ల టీమ్ లో కన్సిస్టెన్సీ లేకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఇండియా వరుస ఓటమికి మీరు అనుకుంటున్న కారణాలు ఏంటో కామెంట్ చేయండి.





















